అద్భుతమే: పేరెంట్స్ బైక్ నుంచి కిందపడినా.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి(వీడియో)
Recommended Video
బెంగళూరు: కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా కొందరు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడటం చూస్తూనే ఉంటాం. తాజాగా జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయ్యి ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
Miracles do happen but not all the time, this is what happened at #Bengaluru, parents were travelling with kid and met with accident due to over speed, parents fell down n bike ran with kid for 300 meters, then fall on grass devider. Thank god kid is safe n parents got injured pic.twitter.com/nb9vH8lGiZ
— Nellutla Kavitha (@iamKavithaRao) August 21, 2018
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన దంపతులు, తమ రెండేళ్ల చిన్నారితో కలిసి బైక్పై బెంగళూరు-తమకూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ ముందున్న మరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడిపోయారు.
అయితే, ముందు కూర్చున్న చిన్నారితోపాటు ఆ బైక్ కొద్ది దూరం ప్రమాకరంగా వెళ్లింది. అనంతరం ఓ లారీకి సమీపంగా వెళ్లినప్పటికీ.. చివరకు బైక్.. పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొని వాహనంపై నుంచి మొక్కల మధ్యలో పడిపోయాడు. దీంతో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.