అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడి ఆచూకీ లభ్యం: ఇండియన్ ఆర్మీకి తెలిపిన చైనా పీఎల్ఏ
న్యూఢిల్లీ: చైనా భూభాగంలోకి వెళ్లి అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడి ఆచూకీ లభ్యమైంది. ఈ మేరకు సమాచారాన్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ).. భారత సైన్యానికి సమాచారం అందించింది. నిబంధనల ప్రకారం అతడ్ని తిరిగి భారత్ అప్పగించేందుకు చైనా ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏఎన్ఐ నివేదించిన వివరాల ప్రకారం... 'చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన బాలుడిని కనుగొన్నామని, తగిన విధానాన్ని అనుసరిస్తున్నట్లు మాకు తెలియజేసింది' అని పీఆర్ో డిఫెన్స్, తేజ్‌పూర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే వెల్లడించారు.

కనుగొనబడిన వ్యక్తి మిరాన్ టారోన్, సైన్యం సహాయం కోరిన 17 ఏళ్ల బాలుడేనా? కాదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు.
తాజా
పరిణామానికి
సంబంధించి
మరిన్ని
వివరాలు
తెలియాల్సి
ఉంది.
మిరాన్ టారోన్ ఎవరు?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన యువకుడు. ఈ వారం ప్రారంభంలో అతడ్ని పీఎల్ఏ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఘటన జరిగినప్పుడు టారోన్, మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో వేట సాగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
తప్పిపోయిన బాలుడి గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ.. పీఎల్ఏని సంప్రదించింది.
సెప్టెంబరు 2020లో ఇదే విధమైన సంఘటన జరిగింది, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబంసిరి జిల్లా నుండి ఐదుగురు యువకులను పీఎల్ఏ అపహరించి, వారం తర్వాత వారిని విడుదల చేసింది.
తూర్పు లడఖ్‌లో భారతదేశం, చైనాలు దాదాపు రెండేళ్లుగా ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్న సమయంలో తాజా ఎపిసోడ్ జరిగింది.
కాగా, ముఖ్యంగా, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనాతో భారతదేశం 3,400 కి.మీ-పొడవు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ను పంచుకుంటుంది. ఇప్పటివరకు, రెండు వైపుల అధికారులు సైనిక స్థాయి చర్చలు 14 రౌండ్లు జరిపారు, కానీ, ఎటువంటి పరిష్కారం కనుగొనబడలేదు.