Tamil Nadu Surveys: డీఎంకే కూటమి గెలిచేది ఎన్ని సీట్లంటే ? స్టాలిన్ లెక్క్ ఇదే..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil nadu Assembly Election 2026) మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపటితో అక్కడ ప్రచారానికి శుభం కార్డు పడుతోంది. ఈసారి తమిళ ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డీఎంకే కూటమి (DMK alliance) ఈాసారి ఎన్ని సీట్లు గెలవబోతోందనే అంశంపై సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin)కు ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టులతో పాటు పలు సర్వే రిపోర్టులు కూడా అందాయి. దీంతో స్టాలిన్ వాటి సారాంశాన్ని వెల్లడించారు.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమికి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న అన్నాడీఎంకే-బీజేపీ కూటమి పరిస్ధితిపై సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీ ఎన్నటికీ ఎదగలేదని ఆయన తేల్చేశారు. బీజేపీ యొక్క ఏఐఏడీఎంకే ముసుగును తొలగించడానికే తాము 'తమిళనాడు వర్సెస్ ఎన్డీఏ' ప్రచారాన్ని చేపట్టామన్నారు. వారిని ప్రజలు పదేపదే తిరస్కరించారని స్టాలిన్ గుర్తుచేశారు.

BJP can never grow in Tamil Nadu. We have taken up the ‘TN vs NDA’ campaign only to tear off the BJP’s AIADMK mask. They have been repeatedly rejected by the people.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 20, 2026
There is a pro-incumbency wave in Tamil Nadu, and we will confidently win over 200 seats with people’s backing.… pic.twitter.com/GEVOJMQMyh
తమిళనాడులో ఈసారి ఎన్నికల్లో అధికార పక్షానికి (డీఎంకే కూటమి) అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రజల మద్దతుతో తాము 200కు పైగా సీట్లను సునాయాసంగా గెలుస్తామని స్టాలిన్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో డీఎంకే కూటమి 170-180 సీట్లు గెలుస్తుందని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో తమ లెక్క ప్రకారం 200కు పైగా సీట్లు గెలువబోతున్నట్లు స్టాలిన్ చెప్పిన అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ పార్టీ టీవీకే ప్రభావం గురించి స్టాలిన్ కు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications