Kamal Haasan సంచలన లేఖ: వైన్ షాప్‌లపై సీఎం విజయ్‌కి సూచనలు

అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న గ్రామసభల వేళ, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవాలంటే క్షేత్రస్థాయి పాలన బలోపేతం కావాలంటూ మక్కల్ నీది మైయం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్.. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కి ఒక బహిరంగ లేఖ రాశారు. మహాత్మా గాంధీ కన్న 'గ్రామ స్వరాజ్యం' కల నెరవేరాలంటే గ్రామసభలకు నిజమైన అధికారాలు కల్పించాలని, దేశంలోనే తమిళనాడును పంచాయతీ రాజ్‌కు ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

మనోభావాలను దెబ్బతీసేలా లేదా గ్రామీణ వాతావరణాన్ని పాడుచేసేలా ఉండే ప్రభుత్వ మద్యం బారీలు విషయంలో కమల్ హాసన్ సంచలన సూచన చేశారు. గ్రామాల్లోని వైన్ షాపులను ఎత్తివేయాలన్నా, లేదా కొత్త షాపులు ఏర్పాటు చేయాలన్నా సంబంధిత గ్రామసభల అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మద్యం షాపును ఉపసంహరించుకోవాలని గ్రామసభ వీటో తీర్మానం చేస్తే, ప్రభుత్వం రాబడిని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ఆ తీర్మానానికి కట్టుబడి ఉండి షాపును మూసివేసేలా పక్కా చట్టబద్ధమైన మెకానిజాన్ని రూపొందించాలని స్పష్టం చేశారు.

MNM Chief Kamal Haasan Urges TN CM Vijay for Gram Swaraj Reform Ahead of October 2 Gram Sabha Meets
విజయ్ ఎలా సాల్వ్ చేస్తాడో గానీ..: చిలికి చిలికి గాలివాన
విజయ్ ఎలా సాల్వ్ చేస్తాడో గానీ..: చిలికి చిలికి గాలివాన

గ్రామ ప్రతినిధులకు భారీ వేతనాలు.. పెరగనున్న హోదా!

గ్రామీణ స్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న పంచాయతీ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం ప్రస్తుతం చాలా తక్కువగా ఉందన్న అంశాన్ని కమల్ లేఖలో లేవనెత్తారు. వారి బాధ్యతలకు తగినట్లుగా వేతనాలు భారీగా పెంచాలని ప్రతిపాదించారు. గ్రామీణ పంచాయతీ సర్పంచ్‌లకు నెలకు రూ. 16,000, ఉప సర్పంచ్‌లకు రూ. 10,000, మరియు వార్డు మెంబర్లకు రూ. 8,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని, ఇది వారి పనికి తగిన గుర్తింపును మరియు జవాబుదారీతనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

త్యాగాలు చేయాల్సింది ప్రజలు మాత్రమే కాదు: ప్రధాని మోదీకి కమల్ రిక్వెస్ట్
త్యాగాలు చేయాల్సింది ప్రజలు మాత్రమే కాదు: ప్రధాని మోదీకి కమల్ రిక్వెస్ట్

సభ తీర్మానాలకు గడువు.. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తప్పనిసరి!

కేవలం పేపర్లకే పరిమితమయ్యే అధికారుల అలసత్వానికి స్వస్తి పలకాలంటే, గ్రామసభల్లో ఆమోదించిన తీర్మానాలపై కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ కోరారు. సభ ముగిసిన తర్వాత ఏ తీర్మానం ఎంతవరకు అమలులోకి వచ్చిందో తెలిపే 'చర్యల నివేదిక' ను తదుపరి సమావేశంలో ప్రజల ముందుంచడం నిర్బంధం చేయాలన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ఎజెండా మాత్రమే కాకుండా, స్థానిక ప్రజలు తమ సమస్యలను స్వయంగా సభ ఎజెండాలో చేర్చుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక వేదికను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం విజయ్‌కి రాసిన లేఖలో ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+