నివ్వెరపోయే షాక్: అమ్మకానికి అమ్మాయిల ఫోన్ నంబర్స్.. అందాన్ని బట్టి రేటు
అమ్మాయిల అందం పరంగా వారి మొబైల్ నంబర్లకు రేటు ఫిక్స్ చేసి.. ఆకతాయిలకు వాటిని విక్రయిస్తున్నారు.
లక్నో: దేశంలో మహిళా భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకమైపోతున్న తరుణంలో.. ఇల్లు, కాలేజీ, బస్ స్టాప్ అన్న తేడా లేకుండా ప్రతీ చోటా వారు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆఖరికి మొబైల్ రీచార్జీ సెంటర్స్ సైతం మహిళలను పనిగట్టుకుని వేధించే కార్యకలాపాలను యథేచ్చగా నడుపుతుండటం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ నయా దందా బయటపడింది. అమ్మాయిల అందం పరంగా వారి మొబైల్ నంబర్లకు రేటు ఫిక్స్ చేసి.. ఆకతాయిలకు వాటిని విక్రయిస్తున్నారు. రీచార్జీ చేయించుకోవడానికి వెళ్లిన అమ్మాయిల నంబర్లను సేకరించి.. అనంతరం అమ్మాయిల నంబర్లు కావాలంటూ తమను సంప్రదించేవారికి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

లక్నోపాటు పలు పట్టణాల్లో ఇదో కొత్త రకం దందా జోరుగా సాగుతోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 1090 నంబరుతో ప్రారంభించిన పోలీసు హెల్ప్ లైన్ కు దీనిపై ఆరు లక్షల ఫిర్యాదులు వెల్లువెత్తాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
లక్షల కొద్ది అందిని ఈ ఫిర్యాదుల్లో గుర్తు తెలియని వ్యక్తులు తమతో స్నేహం చేయాలంటూ వేధిస్తున్నారని అమ్మాయిలు పేర్కొనడం గమనార్హం. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దందా బాగోతాన్ని బట్టబయలు చేశారు. మొబైల్ నంబర్లను విక్రయిస్తున్న పలువురు రీచార్జీ సెంటర్ నిర్వాహుకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications