Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ క్యాబినెట్ 2.o : 43 మందికి కొత్తగా మంత్రి పదవులు, క్యాబినెట్ నుండి వైదొలగిన కేంద్ర మంత్రులు వీరే !!

మోడీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ సాయంత్రం జరగనున్న నేపథ్యంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర క్యాబినెట్ విస్తరణ పై భారీ ఊహాగానాలు నెలకొన్న సమయంలో దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేసిన సమయంలో ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం మోడీ కేబినెట్ లో కొనసాగుతున్న పలువురు మంత్రులు తాము క్యాబినెట్ నుండి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పునర్వ్యవస్థీకరణకు కొన్ని గంటల ముందు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి గా పనిచేస్తున్న రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, సంతోష్ గంగ్వార్ ఇద్దరూ తమ రాజీనామా లేఖల్లో అనారోగ్య కారణాల వల్ల తమ తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం.

Modi Cabinet 2.o .. These are the Union Ministers who have dropped from the Cabinet, key changes

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ తన మంత్రి పదవికి, రాజ్య సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖా మంత్రి సదానంద గౌడ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం.గత కొన్ని వారాలుగా ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ లో ఉన్న మంత్రుల పనితీరును సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న, సమర్థవంతంగా శాఖలను నిర్వహించలేని మంత్రులకు, వృద్ధులైన సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నట్టు తాజా పరిణామాలతో తెలుస్తుంది.

Recommended Video

    AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu

    ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ విస్తరణ కు ఈరోజు సాయంత్రమే ముహూర్తం ఖరారు కాగా ప్రస్తుత క్యాబినెట్ లో మరో 43 మంది కొత్తగా మంత్రి పదవులు వరించనున్నాయని అంచనా వేస్తున్నారు.వీరిలో నలుగురు మాజీ సీఎం లకు మోదీ క్యాబినెట్ లో బెర్త్ ఖాయం గా కనిపిస్తోంది. వీరు కాక స్వతంత్ర హోదాలో ఉన్న మంత్రులు, సహాయ మంత్రి హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి పలు కీలక పరిణామాల మధ్య మోడీ 2.O కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+