వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

667కోట్ల విలువైన కళాఖండాలు, ఎన్ఎస్జీ: ‘ఫ్రెండ్’కి మోడీ థ్యాంక్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అపహరణకు గురైన భారత కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది. 2వేల ఏళ్ల నాటి సుమారు రూ.667 కోట్ల విలువైన 200 సాంస్కృతిక కళాఖండాలను మనదేశానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దృఢ బంధానికి సాంస్కృతిక వారసత్వమే వారధి అని అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

బ్లెయిర్‌హౌస్‌లో దొంగిలించిన భారత కళాకృతులను అమెరికా అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బహుమతులు పెంచడం అన్నది చాలా అరుదు. కొన్నిసార్లు మనుషులు చేయలేనిది.. విగ్రహాలు చేస్తాయి' అని అన్నారు. గత రెండేళ్లలో పలు దేశాలు.. భారత కళాఖండాలను తిరిగిచ్చేందుకు ముందుకొచ్చాయన్నారు.

ఆయా దేశాల ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు.. వాటిని తరలించడంపై అప్రమత్తంగా ఉన్నాయన్నారు. వాటిని తిరిగి అందజేసిన అమెరికాకు, స్నేహితుడైన ఆ దేశాధ్యక్షుడు ఒబామాకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. 'కొందరికి అవి డబ్బుల్లా కనిపించొచ్చు. కానీ, భారత ప్రజలకు మాత్రం అవి సంస్కృతి. గత వారసత్వాన్ని గుర్తుచేస్తాయి' అని అన్నారు.

అప్పగించిన వాటిలో దేవతా విగ్రహాలు, టెర్రాకోట భాగాలు, చెన్నైలోని శివాలయం నుంచి దొంగిలించిన చోళుల కాలంనాటి సెయింట్‌ మాణిక్కవిచావకర్‌ విగ్రహం, బాహుబలి విగ్రహం, వెయ్యేళ్ల నాటి గణేశుడి కంచు విగ్రహాలున్నాయి.

కాగా, భారత్‌కు అప్పగించిన కళాఖండాలను ఆపరేషన్‌ హిడెన్‌ ఐడల్‌లో అమెరికా హోంలాండ్‌ భద్రతా దర్యాప్తు (హెచ్‌ఎ్‌సఐ) అధికారులు 2007లో స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాలను, కళాఖండాలను అక్రమంతా తరలిస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో తనిఖీలు చేసి 7పెట్టెల కళాకృతులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అలా అక్రమంగా తరలించింది ఓ భారతీయుడే కావడం గమనార్హం.

అమెరికాలో ఆర్ట్‌ ఆఫ్‌ ద పాస్ట్‌ అనే గ్యాలరీని నిర్వహించే సుభాష్‌ కపూర్‌ వాటిని అక్రమంగా రవాణా చేశాడు. 'మార్బుల్‌ గార్డెన్‌ టేబుల్‌ సెట్స్‌' పేరిట దిగుమతి చేశాడు. కపూర్‌పై నిఘా పెంచిన అధికారులు ఆ పని చేసింది అతడే అని నిర్ధారించారు. ప్రస్తుతం సుభాష్‌ కపూర్‌.. భారత కస్టడీలోనే ఉన్నాడు. వివిధ దేశాల సాంస్కృతిక సంపదన కొల్లగొట్టిన అతడిని విచారణ కోసం అమెరికాకు తీసుకొళ్లేందుకు అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వైట్‌హౌస్ ప్రశంస

భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రభావశీలత కలిగిన నాయకత్వాన్ని ప్రదర్శించారని వైట్‌హౌస్ ప్రశంసించింది. వాతావరణ మార్పులు నిరోధంసహా అనేక అంశాలపై నరేంద్ర మోడీ పట్టుదలగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ సమావేశం దృష్ట్యా ఆయన నాయకత్వంపై అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది.

ముఖ్యంగా పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సులో చారిత్రక ఒప్పందం కుదరడానికి భారత్ కీలకపాత్ర పోషించిందని పేర్కొంది. కేవలం భారతీయ ప్రజల ప్రయోజనాలకే కాకుండా మొత్తం ప్రపంచం బాగుకోసమే మోడీ కృషి చేశారని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసలు కూడా అందుకున్నారని వైట్‌హౌస్ తెలిపింది.

అణు సరఫరాల దేశాల కూటమి ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వం పొందేందుకు అన్ని విధాలుగా తోడ్పాను అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వ ఇవ్వడం వల్ల అణువ్యాప్త నిరోధన తదితర అంశాలపై బలంగా నిలబడే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

కళాఖండాల అప్పగింత

కళాఖండాల అప్పగింత

అపహరణకు గురైన భారత కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది. 2వేల ఏళ్ల నాటి సుమారు రూ.667 కోట్ల విలువైన 200 సాంస్కృతిక కళాఖండాలను మనదేశానికి అందజేసింది.

కళాఖండాల అప్పగింత

కళాఖండాల అప్పగింత

ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దృఢ బంధానికి సాంస్కృతిక వారసత్వమే వారధి అని అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్‌ కొత్త చోదక శక్తిగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. కష్టించి పనిచేసే యువ జనాభా కలిగిన భారత్‌.. భవిష్యత్‌ ప్రపంచపు మానవ వనరుల సరఫరా శక్తి అని వివరించారు.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం అమెరికా-భారత్‌ 40వ వాణిజ్య మండలి సర్వసభ్య సమావేశానికి మోడీ హాజరయ్యారు.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని అపార అవకాశాలను వివరించిన మోడీ.. పెట్టుబడులతో రావాలని అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

‘అమెరికా పెట్టుబడులు, సృజన.. భారతీయ మానవ వనరులు, వ్యవస్థాపకత మధ్య భాగస్వామ్యం ఎంతో శక్తిమంతంగా ఉంటుందని భావిస్తున్నా. అలాంటి భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేయొచ్చని నమ్ముతున్నా. భారత్‌ను మార్చే దిశగా మేం ప్రయాణం ప్రారంభించాం' అని తెలిపారు.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

‘1/6వ వంతు జనాభా కలిగిన భారత్‌ను మార్చడం అంటే ప్రపంచాన్ని మార్చడమే. ఆ ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని చూస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనన్న విశ్వాసం కలుగుతోంది. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నా. ఆ ప్రయాణం మీ సంస్థ లాభాన్ని పెంచుకునేందుకు మాత్రమే కాదు.. మెరుగైన భారత్‌ను, మెరుగైన అమెరికాను, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవకాశం కల్పిస్తుంది'అని పేర్కొన్నారు.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రభావశీలత కలిగిన నాయకత్వాన్ని ప్రదర్శించారని వైట్‌హౌస్ ప్రశంసించింది.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

వాతావరణ మార్పులు నిరోధంసహా అనేక అంశాలపై నరేంద్ర మోడీ పట్టుదలగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ సమావేశం దృష్ట్యా ఆయన నాయకత్వంపై అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

ముఖ్యంగా పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సులో చారిత్రక ఒప్పందం కుదరడానికి భారత్ కీలకపాత్ర పోషించిందని పేర్కొంది.

అమెరికా పర్యటనలో మోడీ

అమెరికా పర్యటనలో మోడీ

కేవలం భారతీయ ప్రజల ప్రయోజనాలకే కాకుండా మొత్తం ప్రపంచం బాగుకోసమే మోడీ కృషి చేశారని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసలు కూడా అందుకున్నారని వైట్‌హౌస్ తెలిపింది

English summary
Prime Minister Narendra Modi thanked US President Barack Obama for backing India's bid for membership of the elite Nuclear Suppliers Group (NSG).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X