Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లైయింగ్ కిస్, డిఫరెంట్ యాంగిల్స్‌తో వెకిలీ చేష్టలు.. యువకుడికి కోర్టు శిక్ష...

చండీగఢ్ : అమ్మాయిలనే కాదు వివాహితలను కూడా వదలడం లేదు కొందరు మృగాళ్లు. వారిని చూడగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. వెకిలి చేష్టలతో వింతగా ప్రవర్తిస్తుంటారు. అలాగే మొహలీలో కూడా ఓ యువకుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి .. ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆ దంపతుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపుల పర్వాన్ని సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

మొహాలిలోని ఓ హౌసింగ్ సొసైటీలో గల అపార్ట్‌మెంట్‌లో వినోద్ అనే యువకుడు ఉంటున్నాడు. అతని ఎదురు ప్లాట్‌లో ఓ ఫ్యామిలీ ఉంటుంది. భార్య, భర్త ఉంటున్నారు. అయితే వివాహితతో వినోద్ గత కొద్దిరోజుల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను చూసి ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తున్నాడు. దీంతో ఆమె తన భర్తకు విషయాన్ని చెప్పింది. వెంటనే ఆయన యువకుడిని మందలించారు. తర్వాత ఎప్పటిలాగే ప్రవర్తించడం మొదలెట్టాడు వినోద్. అతని తీరు మారలేదు. దీంతో ఆ దంపతులు విసిగిపోయారు.

mohali youth harassed women.. 3 years sentence

ఫ్లైయింగ్ కిస్‌లతోపాటు వివిధ భంగిమలు చూపుతూ వివాహితను ఇబ్బందిపెట్టాడు. దీంతో వినోద్ వేధింపులు భరించలేక .. ఆ జంట పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి .. విచారించారు. జరిగిన ఘటన గురించి కోర్టుకు విన్నవించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన మొహలీ కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా కూడా వేశారు. ఇకనైనా బుద్ధిగా ఉండాలని .. తీరు మార్చుకోవాలని తేల్చిచెప్పింది. లేదంటే శిక్ష కాలాన్ని పొడిగిస్తామని హెచ్చరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+