కోతి దెబ్బకు రూ. 28 వేలు గల్లంతు (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. బిధూనా తహసీల్ కార్యాలయం వద్ద రోహితాష్ చంద్ర అనే వ్యక్తం తన బైక్ డిక్కీలోని బ్యాగ్‌లో ఉన్న నోట్ల కట్టను గమనించిన ఒక కోతి, దాన్ని లాక్కొని గాల్లోకి ఎగురవేయడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా అక్కడ డబ్బుల వర్షం కురిసింది. ఆ డబ్బును పట్టుకోవడానికి అక్కడున్న ప్రజలంతా పోటీపడగా.. ఈ గందరగోళంలో రోహితాష్ చంద్రకు రూ.80 వేల నుంచి కేవలం రూ.52 వేలు మాత్రమే తిరిగి లభించాయి. అంతే ఆ నోట్ల కట్టలో మొత్తం రూ.80 వేలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు రూ.28 వేల నష్టం జరిగింది.
In #Auraiya, UP, an astonishing sight was witnessed when a farmer came to the tehsil for registry, carrying money in a bag.
— Spicy Sonal (@ichkipichki) August 27, 2025
A monkey snatched the bag and climbed a tree, then made it rain money by scattering all the notes from the bag. People ran around catching the notes, and a… pic.twitter.com/vmJWMLdujW
కోతులు విచిత్ర చేష్టలు చేసిన కొన్ని ఘటనలు
కోతులు మనుషులను అనుకరిచే స్వభావం కారణంగా తరచుగా ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తుంటాయి. గతంలో జరిగిన మరికొన్ని సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక హల్దీ వేడుకలో పాల్గొన్న ఒక కోతి.. అతిథుల మధ్య నుంచి చాకచాక్యంగా దూరి లడ్డూలను దొంగిలించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో ఘటనలో తమిళనాడులోని కొడైకెనాల్‌లో ప్రయాణిస్తున్న ఒక అమెరికన్ బ్లాగర్.. తన స్కూటీపై ఉన్న బ్యాగ్‌లో నుంచి కోతి చాక్లెట్ కేక్, నారింజ పండ్లను ఎత్తుకెళ్లడంతో ఆశ్చర్యపోయాడు. తాను భారతదేశంలో దోచుకోబడ్డానని వీడియో పోస్ట్ చేసి ఈ ఘటనను వివరించాడు. ఇంకొక ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య రూ.20 లక్షల విలువైన నగలను ఒక బ్యాగ్‌లో పెట్టుకుని వృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం నుంచి బయటకు వస్తుండగా, ఒక కోతి ఆ బ్యాగ్‌ను లాక్కెళ్లిపోయింది. అయితే తర్వాత ఆ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోతుల ప్రవర్తన.. ఆసక్తికరమైన విషయాలు
కోతుల ఈ ప్రవర్తన వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. స్టడీ.కామ్(Study.com) ప్రకారం.. కోతులు మానవులకు అత్యంత దగ్గరి బంధువులు. మానవుల డీఎన్ఏతో కోతుల డీఎన్ఏ 98 శాతం వరకు పోలి ఉంటుంది. అందుకే వాటి ప్రవర్తన కూడా మానవుల మాదిరిగానే ఉంటుంది. కోతులు చాలా తెలివైన జంతువులు. అవి సంఖ్యలను కూడా గుర్తించగలవు. కూడిక, తీసివేత, గుణకారం వంటి గణిత కార్యకలాపాలను కూడా చేయగలవు. కోతుల ఐక్యూ స్థాయి 174 వరకు ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జపాన్‌లో కోతులకు వెయిటర్లుగా శిక్షణ ఇస్తారు. దీనికి కారణం అవి మానవులను సులభంగా అనుకరించగలగడమే. మానవుల మాదిరిగానే ప్రతి కోతికి వేర్వేరు వేలిముద్రలు ఉంటాయి, వాటిని గుర్తించడం కూడా సాధ్యమే. కోతులు సంజ్ఞలను ఉపయోగించి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. అవి సాధారణంగా కుటుంబ సమూహాలలో నివసిస్తాయి. వాటికి ఇష్టమైన ఆహారం అరటిపండ్లు. ఈ ఆసక్తికరమైన విషయాలు కోతులు కేవలం జంతువులు మాత్రమే కాదని, మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో అవి మనకు ఎలా సహాయపడతాయో తెలియజేస్తాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications