Monkeypox : భారత్ లో మంకీపాక్స్ భయాలు -కేంద్రం కీలక నిర్ణయం-ఇక రోజువారీ మానిటరింగ్

భారత్ లో మంకీపాక్స్ భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలుత కేరళలో వెలుగుచూసిన మంకీపాక్స్ కేసులో ఇప్పుడు పలు రాష్టాల్ని భయపెడుతున్నాయి. దీంతో కేంద్రం కూడా దీన్ని లైట్ తీసుకునే పరిస్ధితి లేదు. ఇప్పటికే రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్లతో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల నేపథ్యంలో రోగనిర్ధారణ సౌకర్యాల విస్తరణపై పర్యవేక్షణ, మార్గదర్శకత్వం కోసం, దేశంలో ఇన్ఫెక్షన్ కోసం టీకాను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

 Monkeypox Fears : Centre forms task force to monitor latest situation

ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందానికి నీతి ఆయోగ్ సభ్యుడు, గతంలోనూ కరోనా వ్యవహారాలు చూసిన డాక్టర్ వి.కె.పాల్ ను ఛీఫ్ గా నియమించారు. సోమవారం వరకు భారత్ లో 4 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి వెలుగుచూశాయి.

గత వారం కేరళలో మంకీపాక్స్ లాంటి లక్షణాలతో ఒక యువకుడు చనిపోయాడు. ఆ తర్వాత రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మంకీపాక్స్ వైరస్ గురించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టిందని డాక్టర్ పాల్ ముందుగా సాధారణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 78 దేశాల్లో 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
మంకీపాక్స్ ను అరికట్టేందుకు దేశాలు, సమూహాలు, వ్యక్తులు తమలో తాము మాట్లాడుకుని, ప్రమాదాలను తీవ్రంగా పరిగణించి, ప్రసారాన్ని ఆపడానికి, హాని కలిగించే సమూహాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్ వ్యాప్తిని ఆపవచ్చని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+