Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో మంకీపాక్స్ కలకలం: విదేశం నుంచి వచ్చిన వ్యక్తికి వ్యాధి లక్షణాలు

న్యూఢిల్లీ: పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. మనదేశంలో తాజాగా తొలి ఎంపాక్స్ కేసు నమోదైంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్(Monkeypox) లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వెంటనే అతడ్ని ఐసోలేషన్‌లో ఉంచామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపింది.

రోగి నుంచి నమూనా సేకరించి ఎంపాక్స్(MPox) నిర్ధరణ కోసం పంపించామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Monkeypox outbreak in India symptoms in person from abroad

ఇలాంటి కేసులు వెలుగుచూసిన సందర్బంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, ఎంపాక్స్ ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే వ్యాప్తి చెందుతోంది. ఈ దేశాల్లో ఎంపాక్స్ కారణంగా మరణాలు కూడా సంభవించాయి. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో 18 వేల కేసులు నమోదు కాగా, 926 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎంపాక్స్ కొత్త రకం కేసులు ఇప్పటి వరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతోపాటు స్వీడన్, థాయ్‌లాండ్ దేశాల్లోనూ ఈ కేసులు వెలుగుచూశాయి. కాగా, ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+