చెడగొడ్తున్నారు: సన్నీలియోన్‌ను టార్గెట్ చేసిన హిందూ సంస్థ
ముంబై: అసభ్యత వంటి వాటి పైన ఇప్పటికే ఆగ్రహాన్ని చవిచూస్తున్న బాలీవుడ్ నటి, పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు మరో కొత్త చిక్కు వచ్చింది. సన్నీలియోన్‌ను బహిష్కరించాలని హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్) డిమాండ్ చేస్తోంది.
భారత్‌లోకి సన్నీలియోన్ ఆరంగేట్రం, మహిళ గౌరవాన్ని కించపరిచేలా ఆమె తీరును హెచ్‌జేఎస్ తీవ్రంగా ఖండించింది. సన్నీ పైన హెచ్‌జేఎస్ థానేలో మరో ఫిర్యాదు చేసింది.

హెచ్‌జేఎస్ అధికార ప్రతినిధి ఉదయ్ ధూరి మాట్లాడుతూ.. తాము థానేలోని డోంబివాలీ.. రాంనగర్ పోలీసు స్టేషన్ హెడ్ సునీల్ శివార్కర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
హెచ్‌జేఎస్‌కు చెందిన అంజలి పాలన్ తదితరులు కలిసి ఫిర్యాదు చేశారని ఉదయ్ ధూరి చెప్పారు. ఇలాంటి ఫిర్యాదులనే మహారాష్ట్రలోని పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గోవాలోను ఫిర్యాదు అందించామన్నారు. వారం రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఆరోపణ ఏమిటంటే...
బాలీవుడ్లో నటిస్తున్న సన్నీలియోన్ తన అసభ్యకర, న్యూడ్ పిక్చర్స్ ద్వారా వల్గారిటీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఆమె తన వెబ్ సైట్లో వాటిని ఉంచుతోందన్నారు. సన్నీలియోన్ తీరు భారత దేశంలోని యువతను చెడగొట్టే విధంగా ఉందన్నారు. అలాగే, భారతీయ మహిళల గౌరవానికి నష్టం చేకూర్చేలా ఉందన్నారు.
గత వారం తాము నేవీ ముంబై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, దానికి అతను మాట్లాడుతూ.. ఆమె తన సొంత పిక్చర్స్‌ను ప్రమోట్ చేసుకుంటోందని చెప్పడమే కాకుండా, తమకు ఓ సూచన చేశారని, మహిళలకు టాయిలెట్స్ లేవని, వాటి పైన దృష్టి సారించమని సూచించారని, కానీ చెడు ఏదీ సరికాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications