వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి అసభ్య మార్ఫింగ్ ఫోటో: ఫేస్‌బుక్‌లో పెట్టిన కౌన్సిలర్ అరెస్టు..

సీఎం మార్ఫింగ్ ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టినట్లు హిందూ యువవాహిని సంస్థ ప్రతినిధి లోనిబోర్డర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై దుష్ప్రచారం చేసినందుకు గాను ఘజియాబాద్‌లోని 22వ వార్డు కౌన్సిలర్ రామ్‌కుమార్‌ చౌహాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం మార్ఫింగ్ ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టినట్లు హిందూ యువవాహిని సంస్థ ప్రతినిధి లోనిబోర్డర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫోటోను మార్ఫింగ్ చేయడం, అది అసభ్యకర రీతిలో ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని హిందూ యువవాహిని జిల్లా కన్వీనర్ శతేంద్ర బన్సాల్ తెలిపారు. ఫిర్యాదు అందడంతో ఫేస్ బుక్ నుంచి ఆ పోస్టు తొలగించామని పోలీసులు అన్నారు. అయితే తదుపరి విచారణ నిమిత్తం స్నాప్ షాట్ తీసి ఉంచినట్లు చెప్పారు.

 Morphed Yogi Adityanath image on Facebook lands Ghaziabad councillor in custody

ఐటీ చట్టంలోని సెక్షన్స్ ప్రకారం కౌన్సిలర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫోటో మార్ఫింగ్ పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, హిందూ యువ వాహిని సంస్థ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన సంగతి తెలిసిందే. గతంలోను సీఎం మార్ఫింగ్ ఫోటోల ఆరోపణలతో గ్రేటర్ నోయిడాలో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A municipal councillor from Loni was arrested by Ghaziabad Police on Thursday for allegedly posting a defaced photograph of newly-elected Uttar Pradesh chief minister Yogi Adityanath on his Facebook wall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X