కేరళలో నీటమునిగిన మసీదు: దేవాలయంలో ముస్లీంల ప్రార్థనలు
Recommended Video

తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎన్నో మసీదులు, చర్చిలు నీట మునిగాయి. బుధవారం ముస్లీంల పండుగ బక్రీద్. దీంతో మసీదులలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకపోయింది. దీంతో వారి కోసం ఆలయాలను తెరిచారు.
తద్వారా ఆలయాలు, ఆలయ నిర్వాహకులు మానత్వాన్ని, మంచితనాన్ని చాటారు. మాలా సమీపంలోని ఎరవతూర్‌లో గల పురపిల్లిక్కవ్ రక్తేశ్వరి ఆలయంలో ముస్లీంకు ప్రార్థనలు చేసుకునేందుకు చోటు కల్పించారు ఆలయ నిర్వాహకులు. సమీపంలోని కొచుకదేవ్ మహల్ మసీదు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో వారు ఆలయంలో ప్రార్థనలు చేసారు.

ఈ ఆలయాన్ని నారాయణ ధర్మ పరిపాలన యోగమ్ (ఎస్ఎన్డీపీ) చూస్తోంది. దీని ఆధ్వర్యంలో కేరళ వరదల నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయ, సహకారాలు చేపడుతున్నారు.
ఆలయంలో ఇప్పటికే రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. చాలామంది నిరాశ్రయులు ఆలయంలో ఉన్నారు. దీంతో ముస్లీంలకు ప్రార్థనలు చేసుకునేందుకు మొదట చోటు దక్కలేదు. దీంతో ఆలయానికి చెందిన వారు కొందరు ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి, ఎవరికీ ఇబ్బంది కాకుండా వారు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇక్కడ దాదాపు 300 మంది ప్రార్థనలు చేశారు.












Click it and Unblock the Notifications