ఆ పాప ఏం చేసిందని ఈ ఘోరం: మూడేళ్ల చిన్నారిని 7వ అంతస్తు నుంచి విసిరేశాడు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితుడి మూడేళ్ల కూతుర్ను అత్యంత పాశవికంగా అపార్ట్‌మెంట్ 7వ అంతస్తు నుంచి కిందిక విసిరేశాడు ఓ దుర్మార్గుడు. దీంతో నేరుగా కిందపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

ముంబై కొలాబాలోని రేడియో క్లబ్ దగ్గరలోని అశోకా అపార్ట్‌మెంట్ బ్లాక్-ఏ పై నుంచి చిన్నారి ఒక్కసారిగా కిందపడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందో తెలియకపోవడంతో ముందుగా అపార్ట్‌మెంట్ గేట్లన్నీ మూసివేశారు.

Mumbai: Man throws friends 3 year old baby from 7th floor

రక్తపు మడుగులో పడివున్న పాప మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

బాధిత చిన్నారి షయానా(3) అని, ఆమె పిల్లలతో ఆడుకుంటుండగా.. నిందితుడు అనిల్ చుగానీ(40) ఆమెను ఎత్తును కిటికీలోంచి కిందకు విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే, నిందితుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియదని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+