ఎయిర్ హోస్టెస్ హత్య కేసులో ట్విస్ట్, సోదరి, బాయ్ ఫ్రెండ్ కాదు, హౌస్ కీపర్ !
ముంబాయి/ రాయ్ పూర్: ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ పొందుతున్న రూపాల్ ఓగ్రే అలియాస్ రూపల్ (24) అనే యువతిని ఆమె నివసించే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ లో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఆమెను గొంతుకోసి హత్య చేసిన దారుణ ఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అపార్ట్‌మెంట్‌లో రూపాల్ శవమై కనిపించింది.
రూపాల్ హత్య కేసులో నిందితుడు విక్రమ్ అథ్వాల్ (40)ని ముంబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం నగరంలోని పొవాయ్‌లోని తన ఇంటికి వెళ్లిన నిందితుడు విక్రమ్‌ను పోలీసులు అక్కడే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విక్రమ్ ఎయిర్ హోస్టెస్ రూపాల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనుమానించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ రూపాల్ అనుమానాస్పదంగా చనిపోవడంతో సాటి ఉద్యోగులు సైతం హడలిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం రావడంతో ఈ ఏప్రిల్‌లో ముంబాయి వెళ్లింది. అపార్ట్ మెంట్ లో రూపల్ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే ఆమె శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. రూపాల్ ఓగ్రే తన సోదరి మరియు ఆమె ప్రియుడితో నివసించింది, ఇద్దరూ కొన్ని రోజుల క్రితం ఊరికి వెళ్లారు. రూపాల్ మాత్రమే అపార్ట్ మెంట్ లో ఉండేదని పోలీసులు అన్నారు.
ఆదివారం ఎలాంటి కాల్స్ రాకపోవడంతో రూపాల్ ఓగ్రే కుటుంబం అతని స్నేహితులను సంప్రదించారు.
స్నేహితులు రూపాల్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా లోపల నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా రుపాల్ ఓగ్రే రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే రూపాల్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రూపాల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడిని వెతికి పట్టుకున్నాయి.

హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ ఎయిర్ హోస్టెస్ రూపాల్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు విక్రమ్ అత్వాల్‌ను అరెస్టు చేశామని, హౌసింగ్ సొసైటీలోని సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ కెమెరాలను ఆధారాల కోసం స్కాన్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాంప్లెక్స్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న అత్వాల్ భార్యను కూడా పోలీసులు విచారిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications