ఆ బార్‌లో అశ్లీల నృత్యాలు.. అమ్మాయిలతో బలవంతంగా...!

ముంబై: బార్ డ్యాన్సులకు కేరాఫ్‌గా నిలిచింది ముంబై. ఒకప్పుడు ఈ బార్‌లల్లో అశ్లీల నృత్యాలు ఎక్కువగా ఉండేవి. దీంతోనే సొమ్ము చేసుకునేవారు యజమానులు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో అశ్లీలత తగ్గింది. అయితే కొన్ని బార్లు మాత్రం అమ్మాయిలను బలవంతం చేస్తూ అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఫిర్యాదులు అందడంతో ఓ బార్ పై పోలీసులు దాడులు నిర్వహించగా అక్కడ అమ్మాయిలను బార్ యాజమాన్యం బలవంతపెడుతుండటం చూశారు. దీంతో 17 మంది కస్టమర్లను, ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

మాతుంగా ప్రాంతంలో ఉండే తండూర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో దాడులు నిర్వహించారు ముంబై పోలీసులు. ఇదే బార్‌పై 2018లో కూడా దాడులు నిర్వహించారు. పోలీసులు వెళ్లే సమయానికి అశ్లీల నృత్యాలు జరుగుతుండటం గమనించారు. అంతేకాదు డబ్బులు కూడా కస్టమర్లు డ్యానర్లపై వెదజల్లుతున్నారు. దీంతో మొత్తం 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే 12 మంది మహిళా డ్యాన్సర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి వారిని బార్‌ నుంచి పంపివేశారు. ఇక అరెస్టు అయిన వారిలో బార్ మేనేజర్ కూడా ఉన్నాడు. దాడులు సందర్భంగా పోలీసులు ఒక మ్యూజిక్ సిస్టం రూ.84వేలు క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పర్చగా వారిని రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Mumbai police raid bar, Arrest 23 people forcing bar girls to do obscene dance

ఇదిలా ఉంటే బార్ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ బార్‌కు ఓనర్ సురేష్ శెట్టిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు బార్‌ను నిర్వహించేందుకు సరైన డాక్యుమెంట్లు లేవని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ పరిమిత సమయంకు మించి బార్‌ను తెరిచి ఉంచారని పోలీసులు తెలిపారు. గత నెలలో ముంబై పోలీసులు ఓ డ్యాన్స్ బార్‌పై దాడులు నిర్వహించారు.

మలాద్ ప్రాంతంలో ఉన్న కాకా డ్యాన్స్ బార్‌ నుంచి 22 మందిని అరెస్టు చేశారు. ఇందులో 14 మంది కస్టమర్లు ఉన్నారు. ఈ బారు నుంచి 10 మంది అమ్మాయిలను పోలీసులు రక్షించారు. అయితే పోలీస్ ఇన్ఫార్మర్‌గా ఉన్న మహేంద్ర కుమార్ భండారీ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2015లో ఇదే కాకా బార్‌లో 28 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరంతా బార్ డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా పోలీసులు రైడ్ చేసి అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+