పహల్గాం దాడిపై కాశ్మీరీల్లో తీవ్ర ఆగ్రహం-మమ్మల్ని చంపేసినా పోయేదంటూ..!
కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని కళ్లకు కట్టే ఎన్నో విషయాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఈ మారణహోమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ఎందరో టూరిస్టుల్ని తీవ్రవాదుల బారి నుంచి కాపాడిన స్థానిక హాకర్ సజాద్ అహ్మద్ భట్ తాజాగా అక్కడి పరిస్ధితుల్ని వార్తా సంస్థ పీటీఐకి వివరించాడు. తీవ్రవాద చర్యను అతనితో పాటు మొత్తం కాశ్మీరీలు ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు తెలిపాడు.
ఇది మానవత్వంపై కాశ్మీర్ పై జరిగిన దాడిగా కాశ్మీరీ హాకర్ సజాద్ అహ్మద్ భట్ అభివర్ణించాడు. ఈ దాడితో మొత్తం కాశ్మీర్ షాక్ లో ఉందని అతను వెల్లడించాడు. దీని కంటే వారు తమను(కాశ్మీరీలను) చంపేసి ఉంటే బాగుండేదని అతను తెలిపాడు. ఇది పిరికిపంద చర్యని తెలిపాడు. ఇలాంటి ఘటన తాను చూడటం తొలిసారి అన్నాడు. తద్వారా కాశ్మీర్ లో జరిగిన దాడి కనీవినీ ఎరుగని రీతిలో ఉందని చెప్పకనే చెప్పాడు.

పహల్గాంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు టూరిస్టుల్ని లక్ష్యంగా జరుపుకుని కాల్పులు జరుపుతున్నప్పుడు సజాద్ అహ్మద్ తో పాటు పలువురు స్థానిక కాశ్మీరీలు వారిని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టారు. ఉగ్రవాదుల్ని హిందూ టూరిస్టులపై కాల్పులు జరపకుండా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు తీవ్రవాదుల నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించి వారి కాల్పుల్లో చనిపోయారు.
VIDEO | Pahalgam terror attack: Local shawl hawker Sajad Ahmad Bhat, who carried an injured tourist to safety, says, "This is a murder of humanity, and the entire Kashmir. It would've been better had they (terrorists) killed us, the Kashmiris. This was a cowardly act. This is the… pic.twitter.com/9JRC9j0PZH
— Press Trust of India (@PTI_News) April 24, 2025
అలాగే మరొకరు తన గుర్రంపై బాధితుల్ని ఎక్కించుకుని దూరంగా పారిపోయారు. ఇంకొకరు తన వీపుమీద బాధితుడిని ఎక్కించుకుంటూ పరుగులు తీశాడు. ఇలా కాశ్మీరీలు ప్రదర్శించిన తెగువ ఆరోజు మరెందరో టూరిస్టుల ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని రక్షించేందుకు స్ధానిక గైడ్ నజాకత్ చేసిన ప్రయత్నాన్ని స్వయంగా అతనే అభినందిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.
A BJP youth leader Arvind S Agrawal from Chattisgarh took to Facebook to express heartfelt gratitude towards Nazakat Bhai, a Kashmiri local who risked his life to save his wife and child who were separated. “Aapne apni jaan daav mein lagaake hamari jaan bachayi, hum Nazakat Bhai… pic.twitter.com/G15dz0r3kf
— Mohammed Zubair (@zoo_bear) April 24, 2025
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications