నన్ను ఏ క్షణంలోనైన చంపుతారు..! అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఆయన్ను చంపేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే బీజేపీ కారణంగా తాను ఏదో ఒకరోజు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వలే హత్యకు గురవుతానని అన్నారు. ఇందిరాను చంపినట్టుగానే గన్‌మెన్‌ల చేత బీజేపీ చంపిస్తుందని కేజ్రీవాల్ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతున్నాయి.

సంచలనం రేపుతున్న కేజ్రీవాల్ వ్యాఖ్యలు

సంచలనం రేపుతున్న కేజ్రీవాల్ వ్యాఖ్యలు

మొదటి నుండి ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య అధికారల విషయంలో వివాదం నెలకొంది. దీంతో కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీపై పలు సంధర్భాల్లో విరుచుకుపడ్డారు. ఈనేపథ్యంలోనే ఎన్నికల్లో కూడ రెండు పార్టీల నేతలు ఘాటు విమర్శలు చేసుకున్నారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా బీజేపీ పంచన చేరుతున్నారు.ఈనేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యం నెలకోంది.

అరవింద్ కేజ్రీవాల్ పై యువకుడి దాడీ

అరవింద్ కేజ్రీవాల్ పై యువకుడి దాడీ

తాజాగాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పై కాన్యాయ్ ఉండగానే ఓ యువకుడు దాడి చేశాడు. దీంతో వెంటనే తేరుకున్న ఆప్ కార్యకర్తలు దాడి చేసిన యువకున్ని పట్టుకుని చితకబాదారు. కాగా ఈదాడీని ఖండించిన కేజ్రీవాల్ గతంలో తోమ్మిది సార్లు ఆయనపై దాడీ జరిగిందని బీజేపీపై ఆరోపణలు చేశారు. వారి ప్రోద్బలం వల్లే దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శలు చేశారు.

మీడీయా సమావేశంలో..

మీడీయా సమావేశంలో..

కాగా శుక్రవారంతో తుదిదశ ఎన్నికలకు ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే.అనంతరం ఆయన ఢీల్లోలోని మీడీయాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెబుతున్నట్టుగా గతంలో తోమ్మిది సార్లు జరగడంతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడ కొంతమది కేజ్రీవాల్ దాడికి పాల్పడ్డారు. రోడ్ షో భాగంగా కోడిగుడ్లు,ఒకసారి ఇంకుతో మరోసారి దాడి చేశారు.2014లోకూ వారణాసిలో మోడీపై పోటి చేసినప్పుడు కూడ ఆయపై దాడి జరిగింది.కొన్ని సంధార్భాల్లో ఆయన చెంపను చెల్లుమనించిన ఘటనలు కూడ ఉన్నాయి.

నా వ్యక్తిగత సెక్యూరిటి అధికారితో కూడ ప్రమాదమే

నా వ్యక్తిగత సెక్యూరిటి అధికారితో కూడ ప్రమాదమే

ఈనేపథ్యంలోనే ఆరవింద్ నా ప్రాణాలు ఏక్షణమైన పోవచ్చని ఇందిరాగాంధీని చంపినట్టే తన అంగరక్షకులే చంపివేస్తారని ఆయన అన్నారు. మరోవైపు ప్రతి క్షణం ఆయన చుట్టు ఉన్న పోలీసులు ప్రతి సమాచారాన్ని కేంద్రానికి అందిస్తున్నారని. ఈనేపథ్యంలోనే ఆయన పర్సనల్ సెక్యూరిటీ అధికారి కూడ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తారని అన్నారు. ఈనేపథ్యంలోనే తాను అంగరక్షకుల చేతిలో హతమవుతానని ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+