హెల్మెట్‌తో ఏనుగు బంతాట, కొద్దిలో ప్రాణాలతో బతికారు (వీడియో)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురిలో ద్విచక్ర వాహనం పైన వేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఏనుగు దాడి నుంచి బతికిబయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం నాడు సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
జల్‌పాయిగురి జాతీయ రహదారి 31పైన జరిగిన ఈ ఘటనలో ఆ ఏనుగు హెల్మెట్‌తో బంతి ఆట ఆడినంత పని చేసింది. గోరుమారా అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది.
గోరుమారా అటవీ అధికారి సునీతా వెల్లడించిన వివరాల ప్రకారం... ద్విచక్ర వాహనం పైన రోడ్డుపై వేగంగా వెళుతున్న ఇద్దరికీ ఎదురుగా వచ్చిన ఏనుగును చూసి భయంతో నోటమాట రాలేదు. బైక్ అదుపు తప్పి కింద పడింది. వారు కిందపడ్డారు.
Video Courtesy : ABP News
ఒకరు అక్కడి నుంచి పరుగెత్తాడు. మరో వ్యక్తి తలకు ధరించిన హెల్మెట్ ఆ తాకిడికి కిందపడిపోయి రోడ్డు మీద పడింది. కింద పడిన ఆ వ్యక్తి చేరువలోనే ఉన్న ఏనుగును చూసి దడుసుకుని ముందుకు పరుగెత్తాడు.
పరుగెత్తుతూ ఏదో తట్టుకొని రోడ్డు మీదనే పడ్డాడు. అది సదరు ఏనుగు ముందే పడ్డాడు. ఆ తర్వాత ఎలాగో లేచి అక్కడి నుంచి పరుగెత్తి తప్పించుకున్నాడు.
అయితే, ఏనుగు దృష్టి అంతా పక్కనే ఒరిగిపోయిన బైక్ మీద, రోడ్డు మధ్యలో పడిన హెల్మెట్ మీదే ఉండటంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ లోగా ఏనుగు కాలితో, తొండంతో బైక్‌ను పక్కకు తోసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న హెల్మెట్ వద్దకు వచ్చి దాంతో బంతి ఆట ఆడినంత పని చేసింది.
తొండంతో తోసి, కాలితో ముందుకు తన్ని, మరోవైపు తిరిగి ఇలా కొద్దిసేపు ఆ హెల్మెట్‌తో బంతిలా ఆడింది. అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు విషయాలు వెల్లడించిన అధికారిణి దానిని ప్రత్యక్షంగా చూశారట.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications