మరోసారి ఉలిక్కిపడ్డ ముంబై... డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీవీ నటి..
ప్రముఖ టీవి నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముంబైలోని వెర్సోవా ప్రాంతానికి సాధారణ దుస్తుల్లో వెళ్లిన అధికారులు... అక్కడ ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికాను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముంబైలోని కిల్లా కోర్టులో వీరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సావధాన్,దేవో కే దేవ్ మహారాజ్ వంటి ప్రముఖ హిందీ సీరియళ్లలో నటించిన ప్రీతికా అరెస్ట్ కావడంతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది.

ఫైజల్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా...
వెర్సోవాలోని మచ్చిమార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 7గంటల సమయంలో... ఫైజల్(20) అనే యువకుడి నుంచి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99గ్రా. గంజాయితో పాటు మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దీపక్ రాథౌర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. రాథౌర్‌పై గతంలో రౌడీ షీట్ కూడా బుక్కయినట్లు గుర్తించారు. వెర్సోవా-అంధేరీ ప్రాంతంలో చాలామంది హైప్రొఫెల్ వ్యక్తులకు చాలాకాలంగా రాథౌర్ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపారు.
మూడు ప్రాంతాల్లో ఎన్‌సీబీ దాడులు...
శనివారం(అక్టోబర్ 24) సాయంత్రం నుంచి ఎన్‌సీబీ మొత్తం మూడు ప్రాంతాల్లో దాడులు చేసింది. మహమ్మద్ అలీ రోడ్డులోని మసీద్ సమీపంలో బ్రూనో జాన్ ఎంగ్వాలే అనే ఓ టాంజానియన్‌ని అదుపులోకి తీసుకుంది. అతనిచ్చిన సమాచారం ఆధారం వెర్సోవా ప్రాంతంలో రోహిత్ హిరె అని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి అధికారులు 4గ్రా. కొకైన్,1.88గ్రా. ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మరికొన్నిచోట్ల జరిపిన దాడుల్లో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 325గ్రా. మారిజునా,32గ్రా చరాస్,5గ్రా. మెథాంఫెటమైన్‌తో రూ.12,990 నగదు,ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video

మరోసారి ఉలిక్కిపడ్డ ముంబై...
నిషేధిత డ్రగ్స్‌ను కొన్ని ముఠాలు విదేశాల నుంచి కొనుగోలు చేసి ముంబైలోని సెలబ్రిటీలకు,హైప్రొఫైల్ వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు ఎన్‌సీబీ గుర్తించింది. ఈ సప్లై చైన్‌లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని గుర్తించింది. ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆధారాలతో శనివారం సాయంత్రం నుంచి ఆకస్మిక దాడులు ప్రారంభించింది. ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ బాలీవుడ్‌లో తాజాగా ప్రీతికా చౌహాన్ అరెస్ట్ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications