NCC: చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. అమ్మాయిల కోసం పారా గ్లైడింగ్
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) చరిత్రలో ఒక అద్భుతమైన నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలోనే తొలిసారిగా కేవలం మహిళా క్యాడెట్ల కోసం రూపొందించిన 'ఆల్ గర్ల్స్ బేసిక్ పారామోటార్ శిక్షణా కోర్సు' అస్సాంలోని గౌహతి వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఈశాన్య ప్రాంతం (NER) , న్యూఢిల్లీ ఎన్‌సీసీ డైరెక్టరేట్ జనరల్ సంయుక్త ఆధ్వర్యంలో గౌహతిలోని నిమాస్ పారామోటార్ కేంద్రంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. నారీ శక్తి, యువశక్తి ప్రాధాన్యతను చాటిచెబుతూ ఎన్‌సీసీ అడ్వెంచర్ విభాగంలో ఇదొక మైలురాయిగా నిలిచింది.
'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తితో..
ఈ ప్రత్యేక శిక్షణా కోర్సు కోసం దేశంలోని నాలుగు వేర్వేరు రాష్ట్రాల నుంచి 30 మంది సీనియర్ వింగ్ (SW) ఎన్‌సీసీ బాలికలను ఎంపిక చేశారు. కర్ణాటక, తెలంగాణ, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు ఈ శిక్షణలో పాల్గొంటూ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటుతున్నారు. భిన్నమైన సంస్కృతులు, భాషల నేపథ్యం ఉన్నప్పటికీ వీరంతా ఒక్కటై ఆకాశంలోకి ఎగిరేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.

క్రమశిక్షణ, మానసిక ధైర్యానికి పరీక్ష
పారామోటరింగ్ అనేది అత్యంత సాహసంతో కూడుకున్న ఏరో స్పోర్ట్. దీనికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం, కచ్చితమైన క్రమశిక్షణ ఎంతో అవసరం. శిక్షణలో భాగంగా క్యాడెట్లకు ముందుగా భూమిపై కఠినమైన గ్రౌండ్ ట్రైనింగ్ ఇచ్చారు. పరికరాల వాడకం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , సేఫ్టీ డ్రిల్స్ నేర్పించిన అనంతరం, మోటార్ ఆధారిత పవర్డ్ ఫ్లైట్ శిక్షణలోకి వారిని తీసుకెళ్లారు.
భయాన్ని జయించి ఆత్మవిశ్వాసం వైపు!
కేవలం విమానం నడపడం నేర్పించడమే కాకుండా.. క్యాడెట్లలో నాయకత్వ లక్షణాలు, బృంద భావన, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించేలా ఈ కోర్సును డిజైన్ చేశారు. ఆకాశంలో ప్రయాణించే ప్రతిక్షణం వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న యువతులకు ధైర్యంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ క్యాడెట్లు ఇస్తున్నారని ఎన్‌సీసీ ప్రతినిధులు కొనియాడారు. 'ఐక్యత - క్రమశిక్షణ' అనే ఎన్‌సీసీ నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, రాబోయే రోజుల్లో మరింత మంది బాలికలు సాహస క్రీడల్లోకి రావడానికి ఈ ప్రోగ్రామ్ బాటలు వేస్తోంది.
🇮🇳 SOARING BEYOND LIMITS! ✨#First NCC All Girls Basic Paramotor Course at Guwahati by NER Dte🪂Six days in, and these 30 brave SW girl cadets are showing what courage, discipline and determination truly look like! 💪🇮🇳From mastering new skills to pushing past fear and fatigue, they are breaking barriers, challenging their limits and turning every challenge into a new milestone.The skies are no longer the limit — they are the destination!🚀Nari Shakti in the skies. Yuva Shakti in action. 🇮🇳✨#NCC #NCCNER #NariShakti #YuvaShakti #Paramotor #DG_NCC@HQ_DG_NCC@vatsvirendra1@Assam_DSYW @himantabiswa @easterncomd
— NCC Directorate North Eastern Region (@nccner) October 7, 2026














Click it and Unblock the Notifications
