వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్‌లో స్కాం: రూ.20 లక్షలకు సీటు, మార్పింగ్ ఫోటోతో పరీక్ష రాశారు: సీబీఐ

|
Google Oneindia TeluguNews

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షపై దుమారం కొనసాగుతోంది. ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారని నిన్న రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. అయితే మరో అంశం వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్షలో రిగ్గింగ్ స్కామ్ జరిగిందనే విషయం కలకలం రేపుతోంది. సీబీఐ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం తెలిసింది.

ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

బీహర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాలో స్కామ్ బయటపడింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీలో మాదిరిగా ఈ స్కాం జరిగిందట. నిపుణులు అయిన కొందరు విద్యార్థుల మాదిరిగా ఆన్సర్ షీట్ రాశారట. అందుకు భారీ మొత్తంలో తీసుకున్నారని సీబీఐ వర్గాలు ద్వారా తెలిసింది. ఒక్కో సీటుకు రూ.20 లక్షల వరకు తీసుకున్నారట. అందులో రూ.5 లక్షలు విద్యార్థి వలె వచ్చి పరీక్ష రాసినందుకట.. మిగతా రూ.15 లక్షలు మధ్యవర్తులు, ఇతరులు పంచుకున్నారట.

 మొత్తం 11 మంది

మొత్తం 11 మంది


స్కాంకు సంబంధించి సోమవారం అరెస్టులు జరిగాయి. ఢిల్లీలో ఆరుగురిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ స్కాంకు సంబంధించి సప్తార్ గంజ్‌కు చెందిన సుశీల్ రంజన్ సూత్రధారి అని గుర్తించారు. ఈ స్కాంలో మొత్తం 11 మంది ఉన్నారని సీబీఐ వర్గాలు అంటున్నాయి. అభ్యర్థులతో మాట్లాడి ఏం జరిగిందనే అంశంపై ఆరా తీస్తోంది. కోచింగ్ సంస్థల పాత్ర కూడా గురించి ఎంక్వైరీ చేస్తోంది.

అయినప్పటికీ మోసం

అయినప్పటికీ మోసం


అవకతవకలు జరుగుతాయని పరీక్ష హాలులో పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. వాలెట్, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, క్యాప్, ఆభరణాలు, షూ, హిల్స్ నిషేధించిన సంగతి తెలిసిందే. స్టేషనరీ కూడా తీసుకెళ్లేందుకు అవకాశం లేదు. అయినప్పటికీ ముఠా కుంభకోణం చేసింది. కానీ ముఠా ఫోటోలను మార్పింగ్ చేసింది. అలా పరీక్ష హాలులోనికి ప్రవేశించింది. అభ్యర్థుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ సేకరించి.. హాలులో ఎంచక్కా పరీక్ష చేసింది.

 పరీక్ష ఇలా

పరీక్ష ఇలా


జూలై 17వ తేదీన నీట్ పరీక్ష జరిగింది. మెడికల్, డెంటల్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా పరీక్ష జరిగింది. ఆయుర్వేద, సిద్ద, యునాని, హోమియోపతి, నర్సింగ్ కోర్సులకు కూడా నీట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. దానిని కొందరు ఆసరాగా చేసుకుంటున్నారు.

English summary
seat cost ₹ 20 lakh, of which 5 lakh was given to the person who impersonated the student and solves NEET question paper CBI sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X