సిగరెట్ కాల్చి నాపైకి విసిరాడు: వాడియాపై జింటా
ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతి జింతా మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మే 30వ తేదీన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనకు ముందు నెస్ వాడియా తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.
తన మొహంపైకి కాలుతున్న సిగరెట్ విసిరాడని, తనను గందిలో నిర్బంధించాడని జింతా ఆరోపించారు. కొంత కాలం తన పట్ల నెస్ వాడియా ప్రవర్తన అత్యంత దురుసుగాను హింసాత్మకంగానూ ఉందని ఆమె ఆరోపించారు. తన ముఖంపైకి కాలుతున్న సిగరెట్ విసరడం, తనను గదిలో నిర్బంధించడం, తనపై చేయి చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.

ముంబై పోలీసు కమిషన్ రాకేష్ మిశ్రాకు సమర్పించిన లేఖలో నెస్ వాడియాపై ఆమె అంతటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాడియాను తనకు దూరంగా ఉంచితే చాలునని, తాను ప్రశాంతంగా బతకగలనని ఆె అన్నారు. లేకపోతే ఏదో ఒక రోజు అతను తనను చంపేస్డాడనే భయం పట్టుకుందని ఆమె అన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసి వాడియాకు నష్టం చేద్దామనే ఉద్దేశం తనకు ఏ కోశానా లేదని, తన రక్షణ కోసం అంతకు మించిన మార్గం తనకు కనిపించలేదని జింతా చెప్పారు. భవిష్యత్తులో తనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనకు ప్రమాదం తలపెడతాడనే భయం పట్టుకుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications