Aadhar : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్ - టోల్ ఫ్రీ నంబరుపై ఇక ఈ సేవలు కూడా..
దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు వాడుతున్న వినియోగదారులకు ఆధార్ ప్రాధికార సంస్ధ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (UIDAI)ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆధార్ కార్డుకు సంబంధించిన సేవల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్పులు చేస్తున్న ఉడాయ్ ఇవాళ మరో శుభవార్త ప్రకటించింది. ఆధార్ కు సంబంధించి ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిస్తున్న సేవల్లో మార్పులు చేసింది. దీంతో కొత్తగా మరికొన్ని సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
దేశంలో పౌరులంతా ఇప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ఉడాయ్ అందుబాటులోకి తెచ్చిన సేవల్ని టోల్ ఫ్రీ విధానంలో 1947 నంబర్ ద్వారా వినియోగించుకుంటున్నారు. 2016లో ప్రారంభించిన ఈ టోల్ ఫ్రీ నంబర్ ప్రస్తుతం 24 గంటలూ పనిచేస్తోంది. వీటిలో పలు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఉడాయ్ పలు సేవల్ని ఇందులో అప్ డేట్ చేసింది. వీటితో పాటు తాజాగా మరికొన్ని సేవల్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇందులో తాజాగా అందుబాటులోకి వచ్చిన సేవలు ఇలా ఉన్నాయి.
- ఆధార్ ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవడం
- ఆధార్ PVC కార్డ్ స్టేటస్ తెలుసుకోవడం
- ఆధార్ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడం
- ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకోవడం
- SMS ద్వారా ఆధార్, సంబంధిత సేవల గురించి సమాచారాన్ని పొందడం వంటివి ఉన్నాయి.
#UpdateMobileInAadhaar
— Aadhaar (@UIDAI) July 17, 2023
Enjoy many Aadhaar-related services online, if your mobile is updated with Aadhaar.
You’ll be charged ₹50 for mobile update, with or without other demographic data updates.
Visit your nearest Aadhaarcenter to update your mobile in Aadhaar. pic.twitter.com/E5r7RNSHi5
టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలకు తోడు మరిన్ని సేవలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు ఉడాయ్ ఓ ట్వీట్ లో తెలిపింది. నవంబర్ 2022లో ఉడాయ్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత చాట్‌బాట్ 'ఆధార్ మిత్ర'ని కూడా ప్రారంభించింది. ప్రజలు తమ ఆధార్ కార్డ్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు పొందడంలో సహాయపడటానికి ఆధార్ మిత్ర చాట్‌బాట్ ఉపయోగపడుతోంది. ఆధార్ మిత్ర చాట్‌బాట్‌ని ఉపయోగించి ఫిర్యాదుల స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ మిత్ర చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడానికి స్కాన్ చేసే విధంగా క్యూఆర్ కోడ్‌ను కూడా ఉడాయ్ షేర్ చేసింది. అయినా క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోతే ఉడాయ్ వెబ్ సైట్ ద్వారా సంప్రదించవచ్చని చెబుతోంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications