స్టేషన్ ఒకటే.. ప్లాట్ ఫారాల మధ్య దూరం 2 కిలోమీటర్లు
రైల్వేస్టేషన్ లో ఒక ప్లాట్ ఫారం నుంచి మరో ప్లాట్ ఫారంపైకి వెళ్లాలంటే లిఫ్ట్ లేదంటే ఎస్కలేటర్ ను ఉపయోగిస్తాం. కొందరు పట్టాలు దూకుతారు. అయితే ఈ రైల్వేస్టేషన్ లో ఒక ప్లాట్ ఫారం నుంచి మరో ప్లాట్ ఫారం మారాలంటే 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో బరౌని జంక్షన్ రైల్వేస్టేషన్ ఇది.
గంగానది ఒడ్డున పారిశ్రామిక పట్టణంగా పేరుపొందిన బరౌనిలో చమురు శుద్ధి కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్ కు బరౌని జంక్షన్ అని పేరు పెట్టారు. 1883లో బ్రిటీష్ వారు దీన్ని నిర్మించారు. అప్పట్లో జనాభా తక్కువ కావడంతో ఒక ప్లాట్ ఫారం నిర్మించారు. బరౌని జంక్షన్ ప్రారంభమైనప్పుడు ఇక్కడ గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగేవి. కొంతకాలం తర్వాత ప్యాసింజరు రైళ్లు నడపాలని ప్రజలు కోరారు. ఈ ప్లాట్ ఫారంపై గూడ్స్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో రెండు కిలోమీటర్ల దూరంలో మరో రైల్వేస్టేషన్ నిర్మించారు. దానికి న్యూ బరౌని రైల్వేస్టేషన్ అని పేరు పెట్టారు.

ఈ రైల్వేస్టేషన్ లో కూడా ఒకటే ప్లాట్ ఫారం నిర్మించారు. ఒకే పేరుమీదున్న రెండు రైల్వేస్టేషన్లలో రెండు కిలోమీటర్ల మేర రెండు ప్లాట్ ఫారాలు ఏర్పడ్డాయి. కొన్నాళ్లు ఈ రెండు స్టేషన్లలో ప్లాట్ ఫారం నెంబరు ఉండగా, పాత స్టేషన్ లోని ప్లాట్ ఫారంను రెండో నెంబరు ప్లాట్ ఫారంగా మార్చారు. కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్ లో ఒకటో నెంబరును అలాగే కొనసాగించారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కొత్తగా నిర్మించిన బరౌని రైల్వేస్టేషన్ కు న్యూ బరౌని జంక్షన్ అని పేరు పెట్టారు. రెండు ప్లాట్ ఫారాల మధ్య దూరం మాత్రం ఎప్పటికీ తగ్గించలేనతగా అలాగే మిగిలిపోయింది. ఒకటో నెంబరు ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబరు ప్లాట్ ఫారంకు రావాలంటే రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం భారతీయ రైల్వేనే ఆలోచించాలి.












Click it and Unblock the Notifications