డీకే మామకు ఈడీ సమన్లు, జైలుకు పంపిస్తారా?, సింగపూర్ ఫ్రెండ్, ఐశ్వర్య, లక్ష్మీ పని !

బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూర్ డీకే. శివకుమార్ మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో బాంబు వేశారు. డీకే. శివకుమార్ మామకు బుధవారం సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డీకే సింగపూర్ ఫ్రెండ్, ఐశ్వర్య, లక్ష్మీ హెబ్బాళ్కర్ కు ఈడీ సమన్లు ఇచ్చింది.

మైసూరులో డీకే. శివకుమార్ తిమ్మయ్య నివాసం ఉంటున్నారు. డీకే. శివకుమార్ మామ తిమ్మయ్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే డీకే. శివకుమార్ స్నేహితుడు శశికుమార్, ఆడిటర్ చంద్రశేఖర్ తిమ్మయ్య, సింగపూర్ కు చెందిన డీకే. శివకుమార్ స్నేహితుడు రజనీశ్ గోపినాథ్ కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.

New Delhi: ED Summons DK Shivakumars Father-In-Law Timmaiah Auditor Chandrashekar And Others.

మరో పక్క డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు ఆమెను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. డీకే. శశికుమార్ కు అత్యంత సన్నిహితురాలు, కాంగ్రెస్ పార్టీ బెళగావి గ్రామీణ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు మంగళవారం నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

డీకే. శివకుమార్ కేసులో లెక్కలేని అంత డబ్బు అక్రమంగా చలామణి అయ్యిందని, ఇదే కేసులో చాల మందిని తాము విచారణ చెయ్యాల్సి ఉందని ఈడీ అధికారులు మంగళవారం కోర్టులో చెప్పారు. మొత్తం మీద డీకే. శివకుమార్ అక్రమ నగదు లావాదేవీల కేసులో చాల మందిని విచారణ చెయ్యడానికి ఈడీ అధికారులు సిద్దం అయ్యారని సమాచారం. డీకే. శివకుమార్ మామ తిమ్మయ్యను ఈడీ అధికారులు విచారణ చేసిన తరువాత ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారా ? అనే విషయం జోరుగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+