నోట్ల రద్దుపై దేశీ వయగ్రా యాడ్ దుమ్ములేపింది

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ దేశంలోని పలు దినపత్రికల్లో నరేంద్ర మోడీ ఫోటోతో ఫుల్ పేజీ వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయంలో ఫుల్ ఖుషి అయిన పేటీఎం నరేంద్ర మోడీ ఫోటోతో ఫుల్ పేజ్ ప్రకటన ఇచ్చింది.

ఈ ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తరువాత ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఈ-వాలెంట్ కంపెనీలు లెక్కలేనన్ని ప్రకటనలు ఇచ్చారు.

అయితే ఓ దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్ మాత్రం నెటిజన్లను ఆకర్షించింది. ఈ దేశీ వయగ్రా యాడ్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. ఆ దేశీ వయగ్రా కంపెనీ పెద్ద నోట్లను సమర్థిస్తూ ఈ నిర్ణయానికి లైంగిక సామర్థ్యం పెంచే తమ మాత్రలకు ఉన్న పోలీకలను ఉటంకిస్తూ ఓ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది.

థింక్ డిమానిటైజేషన్, థింక్ స్టే ఆన్ అంటూ శీర్షిక పెట్టింది. ఇది చేదు మాత్ర కాదు, ఇది చాల పవర్ ఫుల్ క్యాప్సుల్స్ అంటూ ప్రకటన ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నాయకుడికి ఎందుకు అభినందనలు చెప్పాలో, ఎందుకు మద్దతు ఇవ్వాలో అని వివరించింది.

ఫిర్యాదులు, ఆరోపణలు చెయ్యడం మానుకోండి నిరంతరం కొనసాగుతూ ఉండండి అంటూ హిలేరియస్ వ్యాఖ్యానాన్ని చేసింది. అయితే ఆ దేశీ వయగ్రా కంపెనీ ఈ ప్రకటనను సీరియస్ గా ఇచ్చిందో ? లేదా సరదాగా ఇచ్చిందో ? తెలీదు కానీ, యాడ్ లో ఉన్న సరదా వివరణ నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The latest to join the bandwagon of ads playing on the current post-demonetisation state of affairs is a print advertisement by a sexual wellness product brand. In a fabulous play of words.
Please Wait while comments are loading...