బెంగళూరులో ఇల్లు కొంటున్నారా ? అక్కడ నాలుగేళ్లలో 146శాతం పెరిగిన రేట్లు..!

దేశంలో వేగంగా ఎదుగుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన బెంగళూరులో ధరల మంట చూస్తూనే ఉన్నాం. రోడ్లపై ఆటో క్యాబ్ బుక్ చేసుకొందామంటేనే రేట్లు మండిపోతున్న ఈ సిలికాన్ సిటీలో సెంథిల్లు గురించి ఆలోచించడం అంటే సగటు వేత జీవికి కష్టమే. అయితే గత కొన్నేళ్లుగా నగరంలో ట్రెండ్స్ గమనిస్తే అక్కడ ఓ ప్రాంతం మాత్రం నిశ్సబ్దాన్ని వీడి సందడి కనిపిస్తోంది. అక్కడ నివాస ప్రాంతాల విలువ జస్ట్ నాలుగేళ్లలోనే 146 శాతం పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు నగరంలో నిద్రాణంగా ఉండే ప్రాంతంగా చెప్పుకునే గుంజూరులో నాలుగేళ్లుగా పరిస్ధితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నివాస ప్రాంతాల సంఖ్య, వాటి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఎంతలా అంటే జస్ట్ నాలుగేళ్లలోనే ఇక్కడ స్తిరాస్తుల విలువ ఏకంగా 146 శాతం పెరిగిపోయినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని స్తిరాస్తి ప్రాజెక్టుల సంస్థ ప్రొప్ ఈక్విటీ తాజాగా గణాంకాలతో వెల్లడించింది.

New Housing Prices in Bengaluru Skyrocket by 146 Over Four Years

2022 ప్రారంభంలో గుంజూర్‌లో 9,031 నివాస యూనిట్లు ప్రారంభమయ్యాయి. అయితే 2025 రెండవ త్రైమాసికం నాటికి 7,635 ఇళ్ళు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తాజా నివేదికల్ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా గుంజూరు మైక్రో మార్కెట్లో బెంగళూరులోని ఐటీ హాట్‌స్పాట్‌లైన వైట్‌ఫీల్డ్, బ్రూక్‌ఫీల్డ్, సర్జాపూర్ రోడ్ , ఔటర్ రింగ్ రోడ్‌లకు సమీపంలో ఉన్న స్థానంతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్‌లతో దూసుకుపోతోందని తేలింది.

New Housing Prices in Bengaluru Skyrocket by 146 Over Four Years

అలాగే ఈ మైక్రో మార్కెట్ ఐటీ , స్టార్ట్-అప్ నిపుణుల్ని పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోందని నివేదికలు చెప్తున్నాయి. 2024లో ఇక్కడ నివాస ప్రాజెక్టుల్లో అమ్మకాలు 10 శాతం పెరిగి 2,828 యూనిట్లకు చేరుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి. అలాగే 2025 మొదటి ఆరు నెలల్లోనే 1,100 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ కలిగి ఉండటం, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు , వినోద కేంద్రాలు వంటి సామాజిక మౌలిక సదుపాయాల ఉనికి ఇక్కడ రేట్లను పెంచేస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, ఇతర సమస్యలు దీని వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+