రూ.1500కే 4జీ ఫీచర్‌ ఫోన్‌, తయారీకి చైనా కంపెనీ సన్నాహాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ చిప్‌ తయారీ సంస్థ స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్‌ అత్యంత తక్కువ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫోన్‌ తయారీ సంస్థలు అందిస్తున్న ధరలకన్నా సగం ధరకే 4జీ సదుపాయంతో పనిచేసే మొబైల్ ఫోన్ ను తీసుకురావాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.

'రూ.1500లకే 4జీ సదుపాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. మా భాగస్వాములతో కలిసి ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాం' అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్ప్రెడ్‌టర్మ్‌ భారత్‌ ఉన్నతాధికారి నీరజ్‌ శర్మ తెలిపారు.

ఇప్పటికే మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో రెండేళ్ల భాగస్వామ్యంలో భాగంగా స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్‌ తో అతి తక్కువ ధరలో ఎల్‌ వైఎఫ్‌ ఫ్లేమ్‌ 5 ఫోన్లను రూపొందించింది. అలాగే లావాతో లావా ఎంఐ 4జీ ఆధారిత ఫీచర్‌పోన్‌ కూడా తీసుకొచ్చింది.

New Spreadtrum Chip To Make Rs. 1,500 4G Feature Phone A Viable Proposition

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ రూపంలో కాకుండా ఫీచర్ ఫోన్ రూపంలో దీన్ని తయారు చేయనున్నారు. అంటే ఆ ఫోన్లలో టచ్ కు బదులుగా కీ ప్యాడ్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. అయితే 4జీ వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్‌ను అపరిమితంగా వాడుకోవచ్చు.

ఇప్పటికే దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్‌లు రూ.3వేల స్థాయిలో 4జీ సదుపాయం కలిగిన ఫోన్లను విక్రయిస్తున్నాయి. కార్బన్‌ కూడా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందించాలని యోచిస్తోంది.

మరోవైపు రిలయన్స్‌ జియో ప్రధానంగా 4జీ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జియో కూడా రూ.1500లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. వీలైనంత త్వరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The feature phones are not going away anytime soon. Earlier there were reports about Reliance Jio working on a low-cost 4G VoLTE feature phone, but now, Spreadtrum Communications, a Shanghai-based semiconductor company popular for its mobile chipsets has announced its plans that will make low-cost 4G feature phones a reality. Spreadtrum has disclosed that it is working on reducing the starting prices of its 4G capable chipsets by at least 50% to make 4G feature phones priced around Rs. 1,500 a viable proposition. Currently, entry-level feature phones from Lava and Micromax are priced at Rs. 3,000.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి