News 18 Survey :తమిళనాడులో మారుతున్న ఈక్వేషన్స్ - కింగ్‌మేకర్‌గా విజయ్..?
తమిళనాడు రాజకీయాల్లో సర్వేల యుద్ధం కొనసాగుతోంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వెలువడుతున్న ముందస్తు అంచనాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా న్యూస్ 18 వెల్లడించిన సర్వే ఫలితాలు ఇప్పుడు అటు డీఎంకే,ఇటు అన్నాడీఎంకే వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.
దశాబ్దాల కాలంగా ద్రావిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తమిళనాడులో ఈసారి త్రిముఖ పోటీ ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన మెజార్టీ సర్వేలు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతుండగా..న్యూస్ 18 సర్వే మాత్రం అందుకు భిన్నంగా నెక్-టు-నెక్ ఫైట్ ఉంటుందని తేల్చేసింది.

న్యూస్ 18 సర్వే లెక్కలివే-ఓట్ల శాతం
ADMK (అన్నాడీఎంకే+): 41.4%
DMK (డీఎంకే+): 39.3%
TVK (తమిళగ వెట్రి కళగం): 12.0%
NTK (నామ్ తమిళర్ కట్చి): 3.7%
అనూహ్యంగా పుంజుకున్న అన్నాడీఎంకే
గత ఎన్నికల్లో ఓటమి పాలైన అన్నాడీఎంకే (AIADMK), ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ఈసారి చాలా బలంగా పుంజుకున్నట్లు ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అన్నాడీఎంకే కూటమి విజయవంతమైందని, ఫలితంగా డీఎంకే కంటే 2.1% ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి, పీఎంకే వంటి పార్టీలతో పొత్తులు కూడా అన్నాడీఎంకేకు కలిసివచ్చే అంశంగా మారింది.
విజయ్ టీవీకే - ఓట్ల చీలిక ఎవరికి నష్టం?
తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తొలి ఎన్నికల్లోనే 12% ఓట్లు సాధిస్తుందని అంచనా వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మొదటిసారి ఓటు వేసే యువత,మార్పు కోరుకునే ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.విజయ్ పార్టీ చీల్చే ఓట్లు ప్రధానంగా డీఎంకే కూటమికి నష్టం కలిగిస్తాయని, ఇది పరోక్షంగా అన్నాడీఎంకేకు మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.
BIG BREAKING !!!
— Koduva :) (@_ImVasu) April 19, 2026
NEWS18 TAMILNADU பகிர்ந்த SURVEY Result :
ADMK 41.4% 🔥🔥
DMK 39.3%
TVK 12%
NTK 3.7%pic.twitter.com/coyPLpn1hH
ఇతర సర్వేలతో పోలిస్తే..
లోక్ పోల్ (Lok Poll) వంటి ఇతర సర్వేలు డీఎంకేకు 180కి పైగా సీట్లు వస్తాయని చెబుతుండగా,న్యూస్ 18 మాత్రం ఓట్ల శాతంలో అన్నాడీఎంకే ముందంజలో ఉందని పేర్కొనడం విశేషం.సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) కూడా తన ఉనికిని చాటుకుంటూ సుమారు 4% ఓట్లు సాధించే దిశగా సాగుతోంది.
తమిళనాడు ఓటరు ఎప్పుడు ఏ తీర్పు ఇస్తాడో ఊహించడం కష్టం. స్టాలిన్ సంక్షేమ పథకాలు ఆయన్ని గట్టెక్కిస్తాయా? లేదా అన్నాడీఎంకే వ్యూహం ఫలించి మళ్ళీ అధికారంలోకి వస్తుందా? అనేది మే 4న ఫలితాల రోజున తేలిపోనుంది. అయితే, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా నటుడు విజయ్ 'TVK' ఓట్ల శాతం అత్యంత కీలకం కాబోతోంది.












Click it and Unblock the Notifications