అంబానీ ఇంటి వద్ద కుట్ర- నిందితుడు సచిన్ వాజే ? ఎన్‌ఐఏ సీన్ రీక్రియేషన్
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్దాలతో కూడిన కారు ఉంచిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అంబానీ ఇంటికి వెళ్లే కార్మెచెల్ రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. ఈ కేసులో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేను నడిపిస్తూ సీన్ రీక్రియెట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్‌లో పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి సజిన్ వాజేయే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంబానీ కేసులో ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద జిలిటెన్ స్టిక్స్ తో కూడిన వాహనాన్ని ఉంచి కుట్రకు పాల్పడ్డ ఘటనలో ఎన్ఐఏ చురుగ్గా దర్యాప్తు సాగిస్తోంది. 22 రోజులుగా ఈ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న జాతీయ దర్యాప్తు సంస్ధ... అంబానీ ఇల్లు ఆంటీలియాకు వెళ్లే కార్మెచెల్ రోడ్డులో పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తిని గుర్తించారు. ఆ సీన్ రీక్రియేట్ చేసేందుకు సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన ఎన్‌ఐఏ అదుపులోనే ఉన్నారు. దీంతో నిన్న రాత్రి సీన్ రీక్రియేషన్ కోసం వాజేను అక్కడికి తీసుకెళ్లారు. ఆయన సమక్షంలో కొన్ని ఆధారాలు కూడా సేకరించారు.

సచిన్ వాజేనే నిందితుడా ?
అంబానీ ఇంటి వద్ద కారులో జిలిటెన్ స్టిక్స్ ఉంచిన ఘటనలో సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేనే నిందితుడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు సీసీ కెమెరాల్లో కనిపించిన పీపీఈ కోటు ధరించిన వ్యక్తి సచిన్ వాజేయే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. దీంతో ఆయన్ను తీసుకొచ్చి సీన్ రీక్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆంటీలియా వద్ద సీన్ రీక్రియేషన్ చేసిన బృందంలో పూణే ఫోరెన్సిక్ నిఫుణులతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా ఉన్నారు.

అతి నిశితంగా ఎన్‌ఐఏ దర్యాప్తు
ఆంటీలియా వద్ద ఎన్ఐఏ దర్యాప్తులో పలు ఉత్కంఠభరిత సన్నివేశాలు కనిపించాయి. అంటీలియా వద్ద జిలిటెన్ స్టిక్స్ ఉంచిన ప్రదేశ వైపు వచ్చే ప్రతీ వాహనం హెడ్ లైట్లు స్విచ్ ఆఫ్ చేయమని ఎన్‌ఐఏ అధికారులు కోరారు. ఆ తర్వాత కెమెరా లైట్లను కూడా ఆన్ చేయవద్దని మీడియా ప్రతినిధులకు చెప్పారు. దీంతో వారు అక్కడ వాహనాలు తిరుగుతున్న సమయంలో ఈ జిలిటెన్ స్టిక్స్ కారు ఉంచడం, అక్కడ విధ్వంసానికి జరిగిన ప్లాన్‌పై నిశితంగా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.40 గంటల తరువాత, ఎన్‌ఐఏ సీనియర్ అధికారులు, సచిన్ వాజే ప్రయాణిస్తున్న అర డజను సైరన్ వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్యాంటు, చొక్కా ధరించిన వాజే, కొన్నిసార్లు నడవమని కోరగా, సిఎఫ్ఎస్ఎల్ బృందం కెమెరాలు మరియు మరికొన్ని కొలిచే పరికరాలను ఉపయోగించి వివరాలను స్వాధీనం చేసుకుంది.

వాజేను పీపీఈ కిట్‌తో నడిపించిన ఎన్ఐఏ
కొద్దిసేపటి తరువాత, సచిన్ వాజేను ఎన్‌ఐఏ అధికారులు కారులోకి ఎక్కి పిపిఈ కిట్ ధరించి తలపై రుమాలు కట్టమని కోరారు. అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకూ ఆయన్ని నడిపించారు. మళ్లీ రోడ్డు మధ్యలో ఆగమని చెప్పారు. తర్వాత ఆంటీలియా వైపు ఎడమవైపు ఉన్న ఫుట్‌పాత్‌పైనా నడిపించారు. పలుమార్లు పలు యాంగిల్స్‌లో నడిపించాక సీన్ రీక్రియేషన్ ముగించారు. అనంతరం వాజే పరిస్ధితిని అధికారులు వాకబు చేశారు. ఈ సమయంలో ఇంటి లోపల ఉండమని ఎన్‌ఐఏ అధికారులు అడిగిన ప్రాంతంలోని నివాసితులు దర్యాప్తు నుండి సాక్ష్యమిచ్చే వాటిని చూడటానికి, వారి భవనాల నుండి బయటకు వచ్చారు.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!











Click it and Unblock the Notifications