వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలు క్యాచ్: మోడీ ఓటమి-నితీష్ గెలుపు,కారణాలెన్నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయే కూటమి చిత్తయింది. బీజెపి 2010 ఎన్నికల్లో 91 సీట్లు సాధించగా ఇప్పుడు అంతకంటే ముప్పైకి పైగా సీట్లు తక్కువ గెలుచుకుంటుంది. నితీష్ కుమార్ మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మోడీ వర్సెస్ నితీష్‌గా మీడియా అభివర్ణించింది. అయితే, ఇవి పార్టీల జయాపజయాలేనని బిజెపి నేతలు చెబుతున్నారు. ఓటమి పైన తాము సమీక్షించుకుంటామని చెబుతున్నారు.

బీహార్ ఎన్నికల్లో బిజెపిని లేదా మోడీని ఓడించేందుకు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయ శత్రువులుగా ఉన్న నితీష్ కుమార్ (జెడీయు), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ) ఒక్కటయ్యాయి. వాటికి కాంగ్రెస్ పార్టీ జత కలిసింది. ఈ మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించాయి.

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమికి, మహాకూటమి గెలుపుకు ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Narendra Modi - Nitish Kumar

మోడీ ఓటమి, నితీష్ గెలుపు వెనుక

- బిజెపి నేతల వ్యాఖ్యలను లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటికి అప్పుడు బాగా క్యాచ్ చేసి కౌంటర్ ఇచ్చారు. గోవులు, యాదవులు తదితర అంశాలపై లాలూ కౌంటర్ ఇచ్చారు.
- ఆరెస్సెస్, బిజెపి నేతలు చేసిన రిజర్వేషన్ వ్యాఖ్యలు బాగా దెబ్బతీశాయని అంటున్నారు. అలాగే బిజెపి నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కూడా దెబ్బతీశాయని చెబుతున్నారు.
- బీహార్ వెలుపలి పరిణామాలు ఎన్నికల పైన పడ్డాయి. దాద్రీ ఘటన, గో మాంసం తదితర అంశాలు దెబ్బతీశాయని అంటున్నారు.
- ప్రధానంగా బిజెపి ముఖ్యమంత్రి పేరును చెప్పలేదు. ఇది అతిపెద్ద మైనస్‌గా మారింది. మహాకూటమి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి దూసుకెళ్లింది. కానీ బిజెపి అభ్యర్థి పేరు చెప్పలేదు.
- బిజెపి సీఎం అభ్యర్థి పేరు చెప్పకపోవడంతో నితీష్ వర్సెస్ ప్రధాని మోడీగా మీడియా అభివర్ణించింది. దీంతో, నితీష్ ఢిల్లీ (మోడీ) దూరమా, బీహార్ (మహాకూటమి) దూరమా అంటూ ప్రజలను ఆకట్టుకున్నాయి. నితీష్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో ఉంటారని, బిజెపిని గెలిపిస్తే... సీఎం అభ్యర్థిని ప్రకటించనందున.. మోడీ ఢిల్లీలో ఉంటారని మహాకూటమి ప్రచారం చేసి విజయం సాధించిందని అంటున్నారు.
- జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పదుడిగా ఉన్నారు. అతనిని కలుపుకోవడం బిజెపికి మైనస్ అయింది అంటున్నారు.
- బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కీలక నేతలు పార్టీలో ఉంటూ పక్కకు జరిగారు. బిజెపి పార్టీకే చెందిన ఎంపీ శతృఘ్ను సిన్హా... నితీష్ కుమార్‌ను పొగుడుతూ పార్టీకి చిక్కులు తెచ్చారు.
- బీహార్‌లో మోడీ హవా కంటే నితీష్ అభివృద్ధి పనుల వైపు ప్రజలు మొగ్గారు.
- జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం కేవలం ఒకే స్థానంలో గెలిచింది.
- బీజెపి కూటమిలోని ఎల్జేపీకి 40 స్థానాలు ఇస్తే అది ప్రభావం చూపలేదు. ఎల్జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్. ఆయన తన వర్గం ఓట్లు రాబడతారనుకుంటే.. కనీసం వారు పోటీ చేసిన స్థానాల్లోను ప్రభావం చూపలేదంటున్నారు.
- ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలోకి దిగినప్పటికీ మైనార్టీలు మహాకూటమి వైపు నిలిచారని చెబుతున్నారు.
- లాలూ ప్రసాద్ యాదవ్‌కు యాదవులు అండగా నిలిచారని చెబుతున్నారు. ఇది కూడా ఆ కూటమికి కలిసి వచ్చిందంటున్నారు.
- నితీష్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. నితీష్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదు.
- బిజెపి - జెడీయులు గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు బీహార్లో మిత్రపక్షాలు. ఆ రెండు పార్టీలు కలిసి 2010 ఎన్నికల్లో రెండు వందలకు పైగా సీట్లు గెలుచుకున్నాయి.
- బిజెపి - జెడియులు విడిపోయాక.. జెడియూ పార్టీ కాంగ్రెస్, లాలూ ఆర్జేడీతో జత కట్టింది. బిజెపి చిన్నాచితక పార్టీలతో జత కట్టింది. బిజెపి - జెడీయూ హయాంలోని అభివృద్ధి నితీష్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

నితీష్ కుమార్ కూల్‌గా...

ఆదివారం ఉదయం బీహార్ అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ముఖ్యమంత్రి, జెడియూ ముఖ్యనేత నితీష్ కుమార్ ఎలాంటి టెన్షన్‌కు గురి కాలేదు. ఆయన సాదాసీదాగా ఉన్నారు.

English summary
Nitish Kumar set to continue as Bihar CM, BJP-led NDA decimated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X