US Visa : నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికా మరో షాక్..! భారతీయులపై దెబ్బ..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయులకు వరుస షాకులిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరోసారి కొరడా ఝళిపించారు. భారతీయులకు జారీ చేసే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు. దీంతో ఇకపై భారతీయులు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీ1, బీ2 వీసాలు తీసుకోవడం కుదరదని తేలిపోయింది.

అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులు ఇప్పుడు వారి స్వదేశం లేదా చట్టపరమైన నివాస దేశంలో వారి ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అమెరికా సాధారణ NIV కార్యకలాపాలను నిర్వహించని సందర్భాలలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. స్వల్ప నోటీసుతో అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులు ఇకపై మరొక దేశంలో వేగవంతమైన బీ1 (వ్యాపార) లేదా బీ2 (పర్యాటక) వీసా అపాయింట్‌మెంట్‌లను పొందే అవకాశం ఉండదు.

No More Fast-Track Visa Appointments Abroad for Indians as US Tightens Rules

కరోనా మహమ్మారి సమయంలో అమెరికా వీసాల కోసం వెయిటింగ్ కాలం మూడేళ్లకు పెరిగిపోయింది. దీంతో అదనపు ఛార్జీలు చెల్లించి వేగంగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ట్రంప్ ఈ నిబంధనను తొలగించడంతో భారతీయులు వేగంగా వీసాలు పొందడం కుదరదు. అప్పట్లో కరోనా కారణంగా వీసా దరఖాస్తులు పేరుకుపోయి వెయిటింగ్ కాలం మూడేళ్లకు చేరింది. మళ్లీ అలాంటి పరిస్ధితి వస్తే మాత్రం వెంటనే వీసాలు పొందేందుకు సాధ్యం కాదు.

No More Fast-Track Visa Appointments Abroad for Indians as US Tightens Rules

నాన్-ఇమ్మిగ్రెంటా్ వీసాల్లో పర్యాటకం, వ్యాపారం, విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, అమెరికా పౌరుల్ని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తులకు ఇచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిపైనా ట్రంప్ తాజా రూల్స్ ప్రభావం పడనుంది. భారత్ లోని అమెరికా కాన్సులేట్‌లపై ఒత్తిడిని తగ్గించడానికి మూడో దేశంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మొదట అనుమతించారు. తాజా సవరణతో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఆ ఉపశమనాన్ని ఉపసంహరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+