నన్ను జైల్లో పెట్టుకోండి: సుప్రీం కోర్టుకు జస్టిస్ కర్ణన్ సవాల్
తనను తిరిగి విధుల్లోకి పంపించాలని లేదంటే మరోసారి తాను కోర్టుకు హాజరుకానని కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: తనను తిరిగి విధుల్లోకి పంపించాలని లేదంటే మరోసారి తాను కోర్టుకు హాజరుకానని కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కార కేసులో ఆయనను విధుల నుంచి దూరంగా ఉంచిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నేడు విచారణకు హాజరైన కర్ణన్.. కావాలంటే జైలుకు పంపండని సుప్రీం కోర్టుకు సవాల్ విసిరారు. అంతేకాదు, తాను సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.
తాను ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తానని చెప్పారు. అయితే, ఏం ఆర్డర్ ఇస్తాననే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.

కాగా, దేశంలో చాలామంది అవినీతిపరులైన జడ్జిలు, న్యాయవాదులున్నారని గత కొన్ని నెలల కిందట కర్ణన్ పలువురిపై ఆరోపించారు. దీంతో కర్ణన్‌ను వ్యతిరేకంగా కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు కర్ణన్‌ను ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయనపై ధిక్కరణ కేసు నమోదు చేసి, బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎదుట హాజరయ్యారు.
జడ్జిలు, లాయర్లపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని, వారికి బేషరుతుగా క్షమాపణ చెబితే కేసు కొట్టేస్తామని కర్ణన్‌ను బెంచ్ అవకాశమిచ్చింది. అయితే కర్ణన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
అంతేకాదు, తాను అంతా చట్ట ప్రకారమే చేశానని చెప్పారు. అంతేగాక, తనను వెంటనే విధుల్లోకి తిరిగి తీసుకోవాలని, లేదంటే మరోసారి కోర్టుకు హాజరుకానన్నారు. తానేమీ టెర్రరిస్టుని కాదని, కావాలంటే ఈ కేసులో తనను జైల్లో పెట్టుకోండని సవాల్ చేశారు. అయితే కర్ణన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ధిక్కార నోటీసులకు నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications