డిగ్రీ పాసైతే చాలు.. నెలకు రూ.71,000 జీతం

దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న NTPC మైనింగ్ లిమిటెడ్, నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందించింది. సుస్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి, ప్రతిష్టాత్మకమైన ఎగ్జిక్యూటివ్ , అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ. 71,000, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులకు నెలకు రూ. 60,000 జీతం అందించబడుతుంది.

NTPC Mining Recruitment 2025 Apply for Executive amp amp Mine Surveyor Posts Salary Up to 71 000

ముఖ్యమైన పోస్టులు ,అర్హతలు:

ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్): ఆర్థిక రంగంలో నిపుణులకు అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు, తప్పనిసరిగా CA (చార్టర్డ్ అకౌంటెంట్) లేదా CMA (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 30 ఏళ్లు.

ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్): పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశం. అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లు.

అసిస్టెంట్ మైన్ సర్వేయర్: ఈ పోస్టుకు మైన్ సర్వే, మైనింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి 40 ఏళ్లు.

ఎంపిక , వయో సడలింపు:
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తుకు తుది గడువు:
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడానికి సిద్ధంగా ఉండండి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 27, 2025 న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 15, 2025.

ఉన్నత జీతం, స్థిరమైన ఉద్యోగం , వృద్ధి అవకాశాలు ఉన్న ఈ అద్భుతమైన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+