Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nurse: భర్తను వదిలేసి ప్రియుడితో రొమాన్స్, ప్రియురాలిని చంపేసిన ప్రియుడు ఏం చేశాడంటే, కన్నింగ్ !

చెన్నై/రాణిపేట్: నర్సింగ్ పూర్తి చేసిన యువతి ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేసింది. నర్సు అనుకోని పరిస్థితుల్లో ఓ యువకుడితో ప్రేమలో పడింది. కుటుంబ సభ్యులకు దూరంగా సిటీలో ఉంటున్న నర్సు ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. నర్సుకు ఆమె కుటుంబ సభ్యులు వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నర్సు పెళ్లి వేరే యువకుడితో జరిగిపోయింది. నర్సుకు ఓ పాప ఉంది. ఇటీవల నర్సు ఆమె భర్తతో గొడవలుపడి వేరుగా ఉంటున్నది. భర్తకు దూరంగా ఉంటున్న నర్సు ఆమె మాజీ ప్రియుడితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. మాజీ ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన నర్సు అటవి ప్రాంతంలో శవమైయ్యింది. పోలీసుల విచారణలో కలకలం రేపిన విషయాలు వెలుగు చూశాయి.

చెన్నైలో నర్సు

చెన్నైలో నర్సు

తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని కావేరీపాక్కం సమీపంలోని రామాపురంలో రేష్మాలత అలియాస్ రేష్మా అనే యువతి నివాసం ఉంటున్నది. నర్సింగ్ పూర్తి చేసిన రేష్మాలత 2017లో చెన్నై చేరుకుని ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటు ఉద్యోగం చేస్తున్న రేష్మా స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్నది.

చికిత్స కోసం వెళ్లి నర్సుతో ఎంజాయ్

చికిత్స కోసం వెళ్లి నర్సుతో ఎంజాయ్

2018లో రేష్మాలత ఉద్యోగం చేస్తున్న ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి కుమారన్ అనే యువకుడు వెళ్లాడు. ఆ సందర్బంలో రేష్మాలత, కుమారన్ కు పరిచయం అయ్యింది. రానురాను కుమారన్, రేష్మాలత ప్రేమలో పడ్డాడు. కుటుంబ సభ్యులకు దూరంగా చెన్నై సిటీలో ఉంటున్న ప్రియురాలు రేష్మాలత ఆమె ప్రియుడు కుమారన్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

ప్రియురాలికి వేరే అబ్బాయితో పెళ్లి

ప్రియురాలికి వేరే అబ్బాయితో పెళ్లి

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న రేష్మాలతకు 2020లో ఆమె కుటుంబ సభ్యులు షాక్ ఇచ్చారు. చెన్నైలోని కాస్మోటిక్ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడితో రేష్మాలత వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నర్సు రేష్మాలత పెళ్లి వేరే యువకుడితో జరిగిపోయింది. నర్సు రేష్మాలతకు ఆరు నెలల పాప ఉంది.

భర్తతో విడిపోయి ప్రియుడితో ఎంజాయ్

భర్తతో విడిపోయి ప్రియుడితో ఎంజాయ్

గత సంవత్సరం రేష్మాలతకు, ఆమె భర్తల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతులు మాత్రం కలిసి జీవించలేకపోయారు. రేష్మాలత ఆమె భర్తతో విడిపోయింది. రేష్మాలత కుమార్తెను ఆమె భర్త పిలుచుకుని వెళ్లిపోయాడు. భర్తకు దూరంగా ఉంటున్న నర్సు రేష్మాలత ఆమె ప్రియుడు కుమారన్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.

మాయం అయిన నర్సు

మాయం అయిన నర్సు

గతనెల 22వ తేదీన ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిన రేష్మాలత బయటకు వెళ్లింది. తరువాత రేష్మాలత ఆచూకిలేదు. రేష్మాలత కనపడటం లేదపి ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగటినా ఎలాంటి క్లూ చిక్కలేదు.

అటవి ప్రాంతంలో లేడీ శవం

అటవి ప్రాంతంలో లేడీ శవం

రాణిపేట్ జిల్లాలోని వాలాజీపేట్ బ్యారేజ్ సమీపంలోని అటవి ప్రాంతంలో ఓ మహిళ శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జిల్లాలో మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు ఆరా తీశారు. రేష్మాలత కనపడటం లేదని పోలీసులకు తెలిసింది.

ప్రియుడితో బైక్ లో వెళ్లిన రేష్మాలత

ప్రియుడితో బైక్ లో వెళ్లిన రేష్మాలత

వాలాజీపేట్ బ్యారేజీ దగ్గర రేష్మాలత ఓ యువకుడితో బైక్ లో వెలుతున్న విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం పోలీసులు గుర్తించారు. పోలీసులు రంగంలోకి దిగి బైక్ నెంబర్ ఆధారంగా కుమారన్ గురించి తెలుసుకున్నారు. పోలీసుల విచారణలో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి.

ఎంజాయ్ చేసి నర్సును చంపేసిన మాజీ ప్రియుడు

ఎంజాయ్ చేసి నర్సును చంపేసిన మాజీ ప్రియుడు

భర్తను వదిలేసిన రేష్మాలత ప్రియుడు కుమారన్ తో కలిసి అటవి ప్రాంతంలోకి వెళ్లి ప్రియుడితో ఎంజయ్ చేసింది. చాలాసేపు అక్కడే ప్రేమికులు రోమాన్స్ చేశారు. తరువాత తనను పెళ్లి చేసుకోవాలని రేష్మాలత ప్రియుడు కుమారన్ మీద ఒత్దిడి చేసింది. అప్పటికే వివాహం చేసుకున్న కుమారన్ సహనం కోల్పోయిన రేష్మాలతను ఆమె పంజాబీ డ్రెస్ వేల్ తోనే హత్య చేశాడు.

బెంగళూరులో ప్రియుడు ఎంజాయ్

బెంగళూరులో ప్రియుడు ఎంజాయ్

రేష్మాలతను హత్య చేసిన కుమారన్ సాక్షాలు నాశనం చెయ్యడానికి ఆమె శరీరం మీద ఉన్న ఐదు తులాల బంగారు నగలు, ఆమె మొబైల్ ఫోన్ ఎత్తుకుని బైక్ లో నేరుగా బెంగళూరు వెళ్లిపోయాడు. బెంగళూరులో రహస్య ప్రాంతంలో కుమారన్ తలదాచుకున్నాడు. కుమారన్ మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా తమిళనాడు పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+