అక్టోబర్‌ లో స్కూళ్లకు 10 రోజుల సెలవులు..!

ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. నేటితో సెప్టెంబర్ నెల కూడా ముగుస్తుంది. ఇక అక్టోబర్ ప్రారంభం కానుంది. మరి అక్టోబర్ లో స్కూల్స్ , కాలేజీలకు ఎన్ని సెలవులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇచ్చేశారు. అక్టోబరులో కూడా చాలా సెలువులు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇక దేశవ్యాప్తంగా పాఠశాలలకు అక్టోబర్ నెలలో ఆదివారాలు మినహాయిస్తే ఆరు రోజులు సెలవులు వచ్చాయి. ఆదివారాలను కూడా కలిపితే 10 రోజులు సెలవులుగా పరిగణించాలి. దసరా, దీపావళితో పాటు మరికొన్ని స్థానిక ప్రభుత్వాల నిర్ణయం మేరకు సెలవులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. దీపావళిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దివాళీకి సెలవులు అధికంగా ఉంటాయి.

ఇక అక్టోబర్‌ నెలను ఓసారి పరిశీలిస్తే.. ఒకటో తారీఖు మహా నవమి, రెండో తారీఖు గాంధీ జయంతితో పాటు దసరా పండుగ ఉంది. ఇక అక్టోబరు ఏడో తారీఖు మహర్షి వాల్మికీ జయంతి, అక్టోబరు 18వ తేదీ దంతెరాస్‌, 20వ తేదీ దీపావళి పండగ ఉన్నాయి. అక్టోబరు 22వ తేదీ గోవర్ధన్‌ పూజ, అక్టోబరు 28వ తేదీ చాత్‌ పూజ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉండనున్నాయి. అంతేకాకుండా స్థానికంగా పలు పండగలు, ఉత్సవాలు సందర్భంగా అక్టోబరులో పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

October 2025 Schools Across India to Enjoy 10-Day Vacation

ఇప్పటికే బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రులు, దసరా పండుగ సందర్భంగా తెలంగాణ, ఏపీలో స్కూల్స్‌, కాలేజీలకు భారీగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక దీపావళికి కూడా రెండు రోజులు ఇచ్చే యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+