వాహనదారులకు దక్కని ఊరట?

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తిగా తెరిచి ఉంటుందని వెల్లడించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన రోజే వెలువడింది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. ఇరాన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఒప్పందం కుదిరే వరకు కొనసాగుతుందని ఇరాన్ పోర్టులపై విధించిన బ్లాకెడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ పరిణామాలతో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. హోర్ముజ్ జలసంధిలో క్రూడాయిల్ కంటైనర్ల రాకపోకలు ఇకపై సజావుగా సాగబోతోండటంతో వాటి రేట్లు నేలచూపులు చూస్తోన్నాయి. గోల్డ్‌మన్ సాక్స్ అంచనాల ప్రకారం జలసంధి మరో నెల పాటు మూసి ఉంటే ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 120- 124 డాలర్ల వరకు స్థిరంగా కొనసాగివుండేదని, ఇప్పుడు వీటి రేట్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది.

Oil Markets Poised for Sharp Moves Impact on Petrol and Diesel Prices after Strait of Hormuz Reopens

ముడిచమురు ధరలు 10 శాతం మేర పడిపోయినా దేశీయంగా శనివారం నాటికి పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. పాత ధరలనే కొనసాగిస్తోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్షీణించడానికి ఇరాన్ కీలక కారణం. గ్లోబల్ షిప్పింగ్ కార్గోకు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ను తిరిగి తెరిచే సంకేతాలు ఇవ్వడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోయింది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి తగ్గింపూ లేదు. సాధారణ రేట్లు కొనసాగుతున్నాయి.

నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+