Viral Video: ఇదే కదా నిజమైన ప్రేమ.. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్న వీడియో..
ప్రస్తుతం సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కుటుంబాలలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. చిన్న కుటుంబాలు పెరిగాయి. భార్యభర్తలు, వారికి ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో కుటుంబాలు ఉంటున్నాయి. అయితే ఈ మధ్య విడాకులు తీసుకునే వారు కూడా పెరిగిపోయారు. చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్నారు.
అడుగులో అడుగేస్తూ..
అయితే ఓ వృద్ధ జంట వర్షంలో గొడుగు పట్టుకుని అడుగులో అడుగేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారిని చూస్తే మలివయస్సులో కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించారు. ఈ వీడియోను ఫోటోగ్రాఫర్, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త ఆసిఫ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. హృదయాన్ని కదిలించే వీడియోను 26 మిలియన్ల మంది వీక్షించారు.

శాశ్వతమైన ప్రేమ..
వర్షం కురుస్తున్న రోజున వృద్ధ దంపతులు కలిసి రోడ్డు దాటుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వృద్ధుడు తన భార్య కోసం గొడుగు పట్టుకుని అతనితో పాటు ఒక బ్యాగ్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తాడు. "ఏదీ లేని ప్రపంచంలో శాశ్వతమైన ప్రేమ ఆలోచన కలిగి ఉండటం మంత్రముగ్దులను కాదా" అని వీడియో క్యాప్చన్ ఇచ్చారు. హృదయాన్ని కదిలించే వీడియోను అందరూ ఇష్టపడ్డారు.












Click it and Unblock the Notifications