వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లతో చర్చలా-ముందు ఈ విషయం తేల్చండి-కేంద్రాన్ని నిలదీసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

|
Google Oneindia TeluguNews

ఆఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరుకుంటున్నారు. నిన్నటి దాకా విదేశీ శక్తుల చేతుల్లో కీలు బొమ్మ లాంటి ప్రభుత్వాలు ఆఫ్గనిస్తాన్‌ను పాలించాయని... ఇప్పుడు అధికారం నిజమైన ఆఫ్గన్ల వశమైందని ప్రకటించుకుంటున్నారు. పైగా తమకెవరితోనూ శత్రుత్వం లేదని,కక్ష సాధింపు చర్యలకు తావు లేదని చెబుతున్నారు. భారత్ సహా అన్ని దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ తాలిబన్లతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

YSRVardhanthi: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మరియు షర్మిల ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు (ఫోటోలు)YSRVardhanthi: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మరియు షర్మిల ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు (ఫోటోలు)

ముందు ఈ విషయం తేల్చండి : ఒమర్ అబ్దుల్లా

ముందు ఈ విషయం తేల్చండి : ఒమర్ అబ్దుల్లా


తాలిబన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం విశ్వసించే పరిస్థితి లేదు. ఇప్పటివరకూ ఇరాన్,రష్యా,చైనా,పాకిస్తాన్ మినహా తాలిబన్లకు మరే దేశం మద్దతు ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో భారత్ తాలిబన్లతో చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒబర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్ల ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నారా లేదా అన్న దానిపై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు.'తాలిబన్ ఉగ్రవాద సంస్థ అవునా కాదా... ఉగ్రవాద సంస్థ అయితే వారితో చర్చలు ఎందుకు జరిపారు... ఒకవేళ ఉగ్రవాద సంస్థ కాకపోతే ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌లో తాలిబన్ ఉగ్రవాద సంస్థ కాదని చెప్పగలరా.. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి ఆ సంస్థ పేరును తొలగించాలని కోరగలరా.' అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. తాలిబన్ ఉగ్రవాద సంస్థను ఇతర ఉగ్రవాద సంస్థలో భిన్నంగా ఎలా చూడగలరని నిలదీశారు.

తాలిబన్లతో భారత్ చర్చలు...

తాలిబన్లతో భారత్ చర్చలు...


ఇటీవల ఖతర్‌లోని దోహాలో భారత దౌత్య అధికారి దీపక్ మిట్టల్ తాలిబన్లతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.ఆఫ్గన్ కేంద్రంగా భారత్‌కు వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని తాలిబన్లకు భారత అధికారి సూచించారు.అఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదానికి తావు ఉండకూడదని అన్నారు. ఇందుకు తాలిబన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆఫ్గన్‌ను ఆక్రమించినప్పటి నుంచి తాలిబన్లు భారత్ పట్ల అనుకూల వైఖరినే ప్రదర్శిస్తున్నారు. అయితే భారత్-పాక్ గొడవల్లోకి తమను లాగవద్దని ఇరు దేశాలకు వారు హెచ్చరిక జారీ చేశారు.జమ్మూకశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

తాలిబన్లతో సంబంధాలకు అంతా దూరం...

తాలిబన్లతో సంబంధాలకు అంతా దూరం...


కాబూల్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమించిన తర్వాత అక్కడి విమానాశ్రయంలో విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అమెరికా,నాటో దళాలు ఉన్నంత వరకే ఇతర దేశాలు అక్కడ అడుగపెట్టే సాహసం చేశాయి. తాలిబన్లను నమ్మే పరిస్థితి లేకపోవడం.. అదొక ఉగ్రవాద సంస్థ కావడంతో వారితో సంబంధాలకు ఏ దేశం ముందుకు రావట్లేదు. పశ్చిమాసియా దేశాలైన ఖతర్,టర్కీలను విమాన సర్వీసులు నడపాలని తాలిబన్లు కోరుతున్నారు. తద్వారా ప్రపంచ దేశాలతో సంబంధాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆఫ్గన్‌లో మానవ హక్కులపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓవైపు ఆఫ్గన్ ప్రజలను ప్రేమతో,సానుభూతితో చూడాలని తాలిబన్ ఫైటర్లకు చెబుతూనే... మరోవైపు ప్రజల పట్ల వారి అరాచకాలను తాలిబన్ ప్రభుత్వం ఉపేక్షిస్తోంది. మానవ హక్కులకు విఘాతం కలిగించేలా,స్త్రీ స్వేచ్చను పూర్తిగా అణచివేసేలా వ్యవహరించే తాలిబన్లకు నిజమైన ప్రజాస్వామ్య దేశాలేవీ మద్దతునివ్వవు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Former Chief Minister of Jammu Kashmir Omar Abdullah has expressed anger over the central government. The Center should give clarity on whether the Taliban are considered a terrorist organization or not Omar Abdullah asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X