కేంద్రం దీపావళి కానుక : పెట్రోల్ పై రూ 5..డీజిల్ రూ 10 మేర తగ్గింపు..!!
దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, రూ.10 తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెట్రోల్..డీజిల్ ధరల నిర్ణయం బాధ్యత ఆయిల్ కంపెనీలకే అప్పగించింది.

వినయోగదారులకు పండుగ కానుకగా
అప్పటి నుంచి రోజు వారీ సమీక్షలో భాగంగా.. ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తున్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్..డీజిల్..వంట గ్యాస్ ధరల పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ ప్రభావం చూపింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పన్నులను సైతం తగ్గించుకోవాలనే సూచనలు..డిమాండ్లు వినిపించాయి. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఊరిపి పీల్చుకుంటున్నాయి.

ఎక్పైజ్ పన్నును తగ్గించటం ద్వారా
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్..డీజిల్ ను తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న నిర్ణయం తో అనేక ప్రాంతాల్లో రూ 105 నుంచి 115 వరకు పలు నగరాల్లో ఉన్న పెట్రోలు ధర పైన రూ 5 వరకు తగ్గనుంది. అదే విధంగా డీజిల్ ధర రూ 10 వరకు తగ్గనుంది. దీపావళి పండుగ నాటి నుంచే ఈ తగ్గుదల అమల్లోకి రానుంది. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించటం ద్వారా ఈ మేర మినహాయింపు దక్కనుంది. అయితే, రాష్ట్రాల పన్నుల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.

రాష్ట్రాలు సైతం పన్నులు తగ్గించుకోవాలంటూ
కేంద్రమే తమ పన్నుల వాటా తగ్గించుకోవటంతో వినియోగదారుడికి ఊరట కలగనుంది. ఇదే సమయంలో రాష్ట్రాలు సైతం వ్యాట్ తగ్గిస్తే మరింతగా వినియోగదారుడి కి మేలు జరుగుతుందని కేంద్రం సూచిస్తోంది. తగ్గిన ధరలతో సామాన్యుల వస్తువుల ధరలు సైతం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసి వంటి సంస్థలకు ఈ తగ్గుదల పెద్ద ఎత్తున మేలు చేయనుంది. ఈ తగ్గుదల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేర పెట్రోలు...డీజీల్ ధరలు తగ్గుతాయి.. ఏమేర ఉపశమనం లభిస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం పెట్రోల్.. డీజిల్‌లో పాత రేట్లే కొనసాగుతున్నాయి. వీటిని ఇక తగ్గించిన ధరలకు అమ్మకాలు చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications