ఏడాదిన్నర బాలుడిపై కత్తితో దాడి.. కడుపు చీల్చిన దుండగులు...!

ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడిపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. పిల్లవాడి పేగులతోపాటు గుండె ఇతర అంతర్గత అవయవాలు బయటడేలా పదునైన ఆయుధంతో కడుపును చీల్చారు. అనంతరం ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న పోలంలో పడేసి వెళ్లిపోయారు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లవాడిని తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు.

బీహార్‌లోని ముంగర్ జిల్లా తారాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రేఖాదేవి దంపతులకు ఏకైక సంతానం ఆశీష్‌ కుమార్. ఆశీష్‌కు ఒకటిన్నర సంవత్సరాలు కాగా, మంగళవారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న ఆశీష్‌ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లి పదునైన ఆయుధంతో దాడి చేశారు. అనంతరం ఇంటికి వందమీటర్లో దూరంలో ఉన్న పోలంలో పడేసి వెళ్లిపోయారు. దుండగుల దాడిలో పిల్లవాడి పేగులతోపాటు గుండె మరియు లీవర్‌లు బయటపడేలా కడుపును చీల్చారు. అయితే ఇంత జరుగుతున్నా ఇంట్లో ఉన్న తల్లికి మాత్రం విషయం తెలియలేదు.

one and half-year-old boy was attacked, found lying in a pool of blood in a field

రక్తపు మడుగులో ఉన్న పిల్లవాడిని గ్రామస్తులు చూసి ఒక్కసారిగి ఆశ్చర్యానికి గురయ్యారు. పిల్లవాడి కడుపు చిల్చీ ఉండడంతో అవయవాలు బయటికి కనిపిస్తుండడంతో విషయాన్ని పక్కనే ఉన్న తల్లికి సమాచారం అందించారు. అనంతరం పిల్లవాడిని స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానిక తీసుకెళ్లడంతో ప్రధమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్సకోసం ఇతర ఆసుపత్రికి తరలించడంతో వెంటనే సర్జరీ చేసి కుట్లు వేశారు.

అయితే పిల్లల కిడ్నాపర్లు ఈ పని చేసి ఉంటారనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తుండగా తమకు ఎవరితో శతృత్వం లేదని ప్రమాదానికి గురైన ఆశీష్ కుమార్ తండ్రి తెలిపాడు. రోజువారి కూలి చేసుకుంటూ మాములు మధ్యతరగతి జీవితం గడుపుతున్న మాకు ఎలాంటీ శత్రుత్వం లేదని చెప్పారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+