ONGC chopper: అరేబియా సముద్రంలో ఓఎన్జీసీ ఛాపర్ అత్యవసర ల్యాండింగ్-9 మంది..

అరేబియా సముద్రంలో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓఎన్జీసీకి చెందిన ఓ ఛాపర్ అరేబియా సముద్రంలోని రిగ్గుల వద్దకు వెళ్తుండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఛాపర్ ను సముద్రంలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరరించి రిగ్గులపైనే ఛాపర్ ను ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఛాపర్ లో ఉన్న 9 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) హెలికాప్టర్ తొమ్మిది మందితో ఇవాళ అరేబియా సముద్రంలో చమురు రిగ్ సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇందులో ఉన్న వారందరినీ రక్షించినట్లు ఓఎన్జీసీ తెలిపింది. ముంబైకి పశ్చిమాన 60 నాటికల్ మైళ్ల దూరంలో ఓఎన్జీసీ సాగర్ కిరణ్ ఆఫ్‌షోర్ రిగ్‌కు సమీపంలో ఉదయం 11:50 గంటలకు హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.

ONGC chopper emergency landing in Arabian Sea and all 9 people rescued

మాల్వియా 16 అనే పేరుగల ఆఫ్‌షోర్ సరఫరా నౌకను రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి మళ్లించారు. కోస్ట్ గార్డ్ విమానం ఆ ప్రదేశానికి సమీపంలో లైఫ్ తెప్పను పడేసింది. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లకు సహాయం చేయడానికి మరొక ఓడ కూడా వెళుతోంది.అయితే అరేబియా సముద్రంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

"ఓఎస్‌వి మాల్వియా 16 ద్వారా నలుగురిని, సాగర్ కిరణ్ ఆయిల్ రిగ్‌లోని పడవలో ఒకరు & ఇండియన్ నేవీ ఏఎల్‌హెచ్, సీకింగ్ హెలికాప్టర్‌ల ద్వారా ఒక్కొక్కరు బయపడ్డారు. ఓఎన్‌జిసి ఆసుపత్రిలో నిర్వహణ కోసం నేవీ హెలికాప్టర్ల ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురిని జుహుకు తరలించారు" అని ముంబై నేవీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+