వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు సీజే అభిశంసన కోరుతూ విపక్ష ఎంపీల నోటీసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీ.జె దీపక్‌ మిశ్రాను అభిశంసించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు సీజేను అభిశంసించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు శుక్రవారం నాడు నోటీసు అందజేశారు.

సిబిఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసుపై స్వతంత్ర దర్యాప్తును అవసరం లేదని సుప్రీం కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది. దరిమిలా విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు శుక్రవారం నాడు సమావేశమై ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Opposition submits notice for Chief Justices impeachment to vice president

ఏడు పార్టీలకు చెందిన సుమారు 64 మంది ఎంపీలు సుప్రీంకోర్టు సీజేను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు నోటీసును ఇచ్చారు.

కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, సిపిఐ, సమాజ్‌వాదీ పార్టీ, బిఎస్పీ, ముస్లిం లీగ్ పార్టీల ఎంపీలు ఈ నోటీసుపై సంతకం చేశారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై ఐదు అంశాల్లో తప్పుడు ప్రవర్తనకు సంబంధించిన అంశాలను ఈ నోటీసులో పొందుపర్చినట్టుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ తెలిపారు.

ఈ ఏడాది జనవరి 12వ తేదిన సుప్రీంకోర్టుకు చెందిన కొందరు నలుగురు జడ్జీలు కొన్ని అంశాలను బహిరంగంగానే మీడియాలో ప్రస్తావించారు. అయితే ఈ అంశాలు ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆయన కపిల్ సిబల్ చెప్పారు.

English summary
Opposition leaders today submitted a notice for the impeachment of the Chief Justice of India (CJI) Dipak Misra to vice president Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X