OSCAR 2023: ది ఎలిఫెంట్ విస్పరర్; తొలిచిత్రానికే ఆస్కార్; చరిత్ర సృష్టించిన ఇండియన్ లేడీడైరెక్టర్!!
ఆస్కార్ 2023 అవార్డును ది ఎలిఫెంట్ విస్పరర్ దక్కించుకుంది. తొలిచిత్రానికే ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన ఇండియన్ లేడీడైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు.
ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ తన మొదటి చిత్రంతోనే రికార్డు సృష్టించారు. తను తీసిన మొదటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలోని ది ఎలిఫెంట్ విస్పరర్ ఆస్కార్ అవార్డును దక్కించుకోవడంతో ప్రస్తుతం ఆమె ఎవరు? ఆమె ప్రస్థానం ఏంటి అన్నది? ది ఎలిఫెంట్ విస్పరర్ కథేమిటి? అన్నది ప్రతి ఒక్కరు ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఆస్కార్ విజేత ది ఎలిఫెంట్ విస్పరర్... తొలిచిత్రంతోనే చరిత్ర
ది ఎలిఫెంట్ విస్పరర్.. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో 2023 సంవత్సరానికి భారతదేశం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. నెట్ ఫ్లిక్స్ ను ఊపేసిన ది ఎలిఫెంట్ విస్పరర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది తమిళనాడుకు చెందిన కార్తీకి గోన్సాల్వేస్. దీనిని నిర్మించింది గునీత్ మోంగా. కార్తీకి గోన్సాల్వేస్ తన తొలి చిత్రంతోనే చరిత్ర సృష్టించింది. ది ఎలిఫెంట్ విస్పరర్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింతో ఆమె ఒంటరైన ఏనుగు పిల్లకు ఒక కుటుంబంతో ఉన్న బాండింగ్ ను ఎంతో హృద్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆమె అకాడమీ సభ్యులను మెప్పించారు.

ఆస్కార్ గెలుచుకున్న అతి కొద్ది మంది భారతీయుల జాబితాలో కార్తీకి గోన్సాల్వేస్
ఆస్కార్ గెలుచుకున్న తర్వాత తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కార్తీకి గోన్సాల్వేస్ తమ చిత్రాన్ని గుర్తించినందుకు, భారతదేశానికి పట్టం కట్టినందుకు, జంతువులను హైలెట్ చేసినందుకు అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. మనకు మరియు మన సహజ ప్రపంచానికి మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని, దేశీయంగా ఉన్న వివిధ కమ్యూనిటీలను, ఇతర జీవుల పట్ల తదాత్మ్య భావనను తెలియజేసినందుకు తాను ఈ వేదికపై ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని గొప్ప చిత్రాలు తెరకెక్కించడానికి ఈ అవార్డు ఎంతో స్ఫూర్తినిచ్చిందని భావిస్తున్నారు. ఆస్కార్ గెలుచుకున్న అతి కొద్ది మంది భారతీయుల జాబితాలో కార్తీకి గోన్సాల్వేస్ చేరారు.

కార్తీకి గోన్సాల్వేస్ ప్రస్తానం ఇదే
ఇండియన్ సినీ పరిశ్రమ గర్వపడేలా చేసిన, అందరి దృష్టి ఒక్కసారి ఆమెపై మళ్లే విధంగా చేసిన కార్తీకి గోన్సాల్వేస్ 1986 సంవత్సరం నవంబర్ రెండవ తేదీన తమిళనాడులోని ఊటీలో జన్మించారు. కార్తీకి గోన్సాల్వేస్ కోయంబత్తూర్ లోని డాక్టర్ జి ఆర్ దామోదర్ అండ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో 2007లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కార్తీకి గోన్సాల్వేస్ చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు. యానిమల్ ప్లానెట్, డిస్కవరీ వంటి అంతర్జాతీయ చానల్స్ కు కెమెరా ఆపరేటర్ గా పనిచేశారు. కార్తీకి గోన్సాల్వేస్ తండ్రి తిమోతి ఏ గోన్సాల్వేస్ ప్రొఫెసర్ . అంతేకాదు ఆయన కంప్యూటర్ సైంటిస్ట్ కూడా. మొదటినుంచి కెమెరా పట్ల ఆమెకున్న అభిరుచి, జంతువుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ ది ఎలిఫెంట్ విస్పరర్ చిత్రానికి కారణమైంది. అదే ఇప్పుడు ఆమెను అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ విజేతగా నిలిపింది.












Click it and Unblock the Notifications