పహల్గాం పోలీసు అధికారిపై ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
గత నెల 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఈ దాడిపై ఎన్ఐఏ ఇప్పటికే కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు జరుపుతోంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికీ దొరకలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ పహల్గాం శాంతిభద్రతలకు బాధ్యుడైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై కీలక నిర్ణయం తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడి జరిగిన 13 రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పహల్గాం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రియాజ్ అహ్మద్‌ను అనంతనాగ్‌కు బదిలీ చేశారు. అతని స్ధానంలో ఇన్‌స్పెక్టర్ పీర్ గుల్జార్ అహ్మద్‌ను పహల్గామ్ కొత్త ఎస్ హెచ్ వోగా నియమించినట్లు అధికారులు తెలిపారు.

జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి వెనుక నిఘా లోపాలతో పాటు శాంతి భద్రతల లోపాలు కూడా ఉన్నట్లు ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. అయినా ఇప్పటివరకూ పహల్గాం స్టేషన్ హౌస్ ఆఫీసర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇవాళ ఉన్నట్లుండి ఈ బదిలీ జరిగింది. తాజాగా కాశ్మీర్ కు చెందిన స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చన్న నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు జరుపుతున్న భద్రతా దళాలు వారిని గుర్తించాయి. అయితే వీరిలో స్థానికులతో పాటు పాకిస్తానీ జాతీయులు ఇద్దరూ ఉన్నారు. కానీ దాడి జరిగిన 12 రోజుల తర్వాత కూడా వారు పరారీలోనే ఉన్నారు. వీరి కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాంతో పాటు దక్షిణ కశ్మీర్ అంతా భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఉగ్రవాదులు లేదా ఉగ్రవాద సానుభూతిపరులుగా అనుమానిస్తున్న పలువురుని అరెస్టు చేశారు.అయినా ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications