పహల్గాం ఉగ్రదాడి.. రెండు భయంకరమైన వీడియోలు బయటకు

పహల్గాం ఉగ్రదాడి గుర్తొస్తే ఓ వైపు కన్నీళ్లు.. మరోవైపు ఆవేశం ఇప్పుడు భారతీయులు అనుభవిస్తున్న తీరిది. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే పహల్గాం ఉగ్రదాడిని ప్రత్యక్షంగా చూసిన టూరిస్టులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కొంతమంది ఆ భయానక దృశ్యాల నుంచి బయటకు వచ్చినా.. మరికొందరు మాత్రం ఇంకా ఆ షాక్ లోనే ఉన్నారు.

తాజాగా పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన మరో రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోల్లో అక్కడి వాతావరణం కళ్లకు కట్టినట్లుగా కనపడుతోంది. ఈ వీడియోలో ఓ టూరిస్టు రోప్ వేలో వెళ్తూ వీడియో రికార్డు చేశాడు. అయితే అనుకోకుండా తీసిన వీడియోలో ఉగ్రదాడి, బుల్లెట్ల సౌండ్, ఓ వ్యక్తి బుల్లెట్ తగిలి కింద పడిపోవడం, రోప్ వే చివరన మృతదేహం ఉండటాన్ని కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.

Pahalgam terror attack Two more horrific videos emerge

మరో వీడియోలో ఉగ్రవాదులకు భయపడి టూరిస్టులు దాక్కోవడం చూడొచ్చు. ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఈ రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ చర్య క్షమించరానిదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఈ క్రూరమైన దాడికి పాల్పడ్డ ముష్కరుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అయితే ఉగ్రవాదులను మొదట అనంత్‌ నాగ్‌ జిల్లాలోని పహల్గాం తెహసీల్ ప్రాంతంలో గుర్తించారు. కానీ, భద్రతా దళాలు అక్కడికి చేరుకునే సరికి వాళ్లు దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలను పసిగట్టి.. అక్కడకు చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి మళ్లీ తప్పించుకున్నారు. అక్కడి నుంచి వాళ్లు త్రాల్ కొండల్లో ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి కూడా తప్పించుకున్న తర్వాత వారి లొకేషన్ కొకెర్నాగ్‌లో బయటపడింది. ప్రస్తుతం వారు ఈ ప్రాంతం చుట్టుపక్కలే తలదాచుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+