చైనా సాయంతో భారీ విధ్వంసం కలిగించే అణ్వాయుధాలపై పాకిస్తాన్ దృష్టి.. అమెరికా థ్రెట్ రిపోర్ట్
భారత్ కారణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఊరుకుంటుందా? భారతదేశంతో అస్తిత్వానికి ప్రమాదం అని భయపడుతున్న పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఎప్పుడూ దుర్బుద్ధితో దొంగ దారిన దెబ్బతీయాలని చూసే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత, తమ ఓటమిని అంగీకరించి సైలెంట్ అయిందా? అయితే అలాంటిదేమీ లేదు, పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తుంది అని తాజాగా వరల్డ్ త్రెడ్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా విభాగం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.
అణ్వాయుధాలను ఆధునీకరించుకునే పనిలో పాకిస్తాన్
భారత్ తో మనుగడకే ముప్పుగా భావిస్తున్న పాకిస్తాన్ సైనికపరంగా బలోపేతంగా ఉన్న భారతదేశాన్ని నిలువరించడం కోసం తనకు ఉన్న ఏకైక మార్గం అణ్వస్త్రాలు అని భావిస్తుంది. అందుకే వాటిని ఆధునీకరించుకొనే పనిలో పడింది. దీనికోసం సైనిక, ఆర్థికపరమైన సహాయాన్ని అందిస్తోంది. ఈ విషయాలను తాజాగా అమెరికా రక్షణ నిఘా విభాగం వెల్లడించింది.

రెడీ అవుతున్న పాకిస్తాన్
రాబోయే సంవత్సరాలలో పొరుగు దేశాల సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం కోసం పాకిస్తాన్ గట్టిగానే సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఆధునీకరించే పనిలో పడింది. దీనికి పాకిస్తాన్ కు చైనా సహాయం అందిస్తోంది. పాకిస్తాన్ తన వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడానికి కమాండ్ కంట్రోల్ వంటి వాటిపైన దృష్టి సారించింది.
భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల ఆధునికీకరణ
భారీగా మానవ హననానికి అవసరమయ్యే ఆయుధ సామాగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం తప్పనిసరి అని భావిస్తున్న పాకిస్తాన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది .డబ్ల్యూఎండి తయారీ, అభివృద్ధిలో వాడే సామాగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుండి పొందుతోంది. వీటిలో కొన్నింటిని తుర్కీయే, సింగపూర్, హాంకాంగ్, యూఏఈ ల నుంచి తెప్పించుకుంటోంది.
పాక్ కు సాయం చేస్తున్న చైనా.. భారత్ తో అస్తిత్వం ప్రమాదంలో ఉందని అలెర్ట్
పాకిస్తాన్ కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా చైనా కొనసాగుతుంది. పాక్ లో వివిధ ప్రాజెక్టుల కోసం చైనీయులు పనిచేస్తున్నారు. కానీ చైనీయుల పైన ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో రెండు మిత్ర దేశాల మధ్య ఈ విషయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనా భారత్ కొట్టిన భారీ దెబ్బతో అస్తిత్వమే ప్రమాదంలో పడిందని భావిస్తున్న పాకిస్తాన్ భారీ విధ్వంసం సృష్టించడానికి తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటుంది.












Click it and Unblock the Notifications