యాంకరమ్మ అజ్ఞానం : అది పండు కాదు తల్లి.. యాపిల్ కంపెనీ... (వీడియో)
అది పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్. దేశ బడ్జెట్‌పై డిబేట్ జరుగుతోంది. సీరియస్‌గా సాగుతున్న చర్చలో యాంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయ పరిజ్ఞానం లేకపోవడంతో అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న ఆ యాంకరమ్మను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందటే..
Apple business and types of apple, just some regular tv shows in Pakistan.. pic.twitter.com/3Sr7IBl7ns
— Naila Inayat नायला इनायत (@nailainayat) July 4, 2019
పాకిస్థాన్ బడ్జెట్‌పై ఓ న్యూస్ ఛానెల్ చర్చ పెట్టింది. డిబేట్‌లో పాల్గొన్న ఆర్థిక రంగ నిపుణుడు దేశ ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఉదాహరణ చెప్తూ పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ కన్నా యాపిల్ బిజినెస్ వాల్యూ ఎక్కువని అన్నారు. ఇంతలో కలగజేసుకున్న యాంకర్ తన నాలెడ్జ్ బయటపెట్టుకుంది. అవును నేను కూడా విన్నాను. భారీ సంఖ్యలో యాపిల్ వెరైటీలు ఉండటంతో ఆ వ్యాపారమే బాగుందంటూ బడ్జెట్‌పై తనకున్న తెలివిని బయటపెట్టింది. దీంతో షాక్ తిన్న సదరు ప్యానలిస్ట్ కాసేపటికి తేరుకుని తాను మాట్లాడుతున్నది యాపిల్ పండు గురించి కాదు.. యాపిల్ కంపెనీ గురించి అని అనడంతో బిత్తరపోయిన ఆ యాంకర్ ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేసింది.

యాంకర్ తెలివికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకేముందు నెటిజన్లు ఆమెతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా జోకులు, సటైర్లు వేస్తూ యాంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మేడంగారు ఏదో కలగంటూ సడన్‌గా నిద్ర లేచినట్టున్నారని ఒకరంటే, పాపం లంచ్ టైంలో ప్రోగ్రాం ఉండటంతో ఆకలితో యాపిల్ యాపిల్ అని అరిచిందని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం పాపం ఆమెను వెనకేసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications